ETV Bharat / politics

వాగుకు నదికి తేడా తెలియని ఒక వ్యక్తి దుర్మార్గానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు : సీఎం చంద్రబాబు - cbn fire on jagan - CBN FIRE ON JAGAN

CBN FIRE ON JAGAN : ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గడగడలాడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలకు సేవ చేయడంతో పాటు రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. అమరావతి మునిగిందని దుష్ప్రచారం చేసే వాళ్లని అందులో పూడ్చాలి.. అప్పుడే బుద్ధొస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వరద ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారని చంద్రబాబు వెల్లడించారు.

cbn_fire_on_jagan
cbn_fire_on_jagan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 3:49 PM IST

Updated : Sep 5, 2024, 10:23 AM IST

CBN Fire On Jagan : ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గడగడలాడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు మంచి జరగదని ఆయన పేర్కొన్నారు. ఎగువన కురిసిన వర్షాల వల్ల బుడమేరులో వరద ప్రవాహం దాదాపు 8 వేల క్యూసెక్కులు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మళ్లీ బుడమేరు పొంగితే ఏం చేయాలనే ఆందోళనలో తాము ఉంటే, రాక్షసులు మాదిరి జగన్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు.

విజయవాడ నగరం వైపు పడిన 3 గండ్లలో ఒక గండిని పూడ్చామని, మరో 2 గండ్లు పూడ్చాల్సి ఉందని పేర్కొన్నారు. బుడమేరులో ఎగువ ప్రాంతంలో పెరుగుతున్న వరద ప్రవాహం వల్ల ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసే యంత్రాంగం ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. కృష్ణా నదికి మరో 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చుంటే మరింత ప్రమాదం సంభవించేదని అన్నారు.

ప్రతి కుటుంబానికి బియ్యం, నిత్యావసరాలు- వరద సాయంపై సీఎం చంద్రబాబు సమీక్ష - CM Chandrababu review

భవానీపురంలో వచ్చిన వరద అన్ని ప్రాంతాలనూ ముంచెత్తిందని అన్నారు. బుడమేరు ప్రవాహాన్ని మళ్లించేందుకు తీసుకున్న చర్యలేవీ అమలు కాలేదన్నారు. బుడమేరు సమీపంలో 2019 నుంచి ఆక్రమణలు పెరిగాయన్న సీఎం బుడమేరు కాల్వ, వాగును గతంలో ఆక్రమించారని తెలిపారు. గత ఐదేళ్లల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం గాడిదలు కాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు ఆక్రమణలపై సర్వే చేయమన్నామని తెలిపారు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ గట్లను కూడా తవ్వేశారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ చేసిన తప్పునకు అమాయకులు ఇబ్బంది పడ్డారని చంద్రబాబు ఆరోపించారు.

అమరావతి మునిగిందని దుష్ప్రచారం చేసే వాళ్లని అందులో పూడ్చాలి అప్పుడే బుద్ధొస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక్క వ్యక్తి అహంభావం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడాలా, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు. అమరావతి మునిగిందా ? వీళ్లను పూడ్చాలి. అప్పుడే బుద్ది వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ నేరస్తులను తప్పుడు ప్రచారం చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలని అన్నారు.

వైఎస్సార్సీపీ లాంటి పార్టీకి రాష్ట్రంలో ఉండే అర్హత లేదని అన్నారు. సాయం చేయకపోగా నిందలేసి తప్పుడు ప్రచారం చేపడతారా? అని సీఎం విమర్శించారు. ప్రజల కోసం తాను యజ్ఞం చేస్తుంటే వైఎస్సార్సీపీ నేతలు రాక్షసుల్లా అడ్డం పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు సేవ చేయాలి, మరోవైపు రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తోందని అన్నారు. బురద జల్లడం ఆపాలని, సిగ్గుంటే క్షమాపణ కోరాలని చంద్రబాబు అన్నారు. తప్పుడు ప్రచారం చేసేవాళ్లని సహించనని హెచ్చరించారు. తన ఇంటిలోకి నీళ్లొస్తే.. వస్తాయి, వెళ్తాయి అని చంద్రబాబు అన్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరానని తెలిపారు. విజయవాడలో, రాజధానిలోనూ ముంపు బారిన పడకుండా కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. బోట్లల్లో తరలింపు కోసం డబ్బులు తీసుకుంటే కేసులు పెడతామని సీఎం హెచ్చరించారు. ప్రైవేట్ బోట్ల వాళ్లూ డబ్బులు వసూలు చేయకూడదని తెలిపారు. తరలింపు కోసం డబ్బులు తీసుకుంటే అరెస్ట్ చేస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించామన్నారు. నిత్యావసరాలు, కూరగాయల ధరలకు ప్రభుత్వమే ఫిక్స్​డ్ ధర నిర్ణయిస్తుందని తెలిపారు. సాయంత్రం లేదా రేపట్నుంచి నిత్యావసర వస్తవుల పంపిణీ చేపట్టనున్నామని తెలిపారు. వివిధ ఉద్యోగ సంఘాలు ఒక్క రోజు జీతం విరాళం ఇవ్వడానికి మందుకొచ్చారని చంద్రబాబు వెల్లడించారు.

వరద బాధితులకు అండగా ప్రభాస్, అల్లు అర్జున్- తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం - Donations To Telugu States

తగ్గిన కృష్ణమ్మ ఉద్ధృతి - ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు - Flood Affected Areas in Vijayawada

Last Updated : Sep 5, 2024, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.