Chevella MP Ranjith Reddy Joined Congress : పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ వలసలు రాజుకుంటున్నాయి. ఓవైపు అధికార పార్టీ కాంగ్రెస్, మరోవైపు బీజేపీలోకి కీలక నేతలు వలస వెళ్తున్నారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా గులాబీ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన సోషల్ మీడియా(Social Media) వేదిక ఎక్స్‌లో పోస్టు చేశారు.
MLA Danam Nagender Joined Congress : చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్లిష్టపరిస్థితుల్లో తాను భిన్న మార్గంలో నడవాలి నిర్ణయించుకున్నట్టు వివరించారు. తన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు ఆమోదించాలని రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గులాబీ పార్టీలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. మరోవైపు గులాబీ పార్టీ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సైతం హస్తం గూటికి చేరారు.
చేవెళ్ల లోక్‌సభలో త్రిముఖ పోటీ - ఎవరు గెలుస్తారో?
బీఆర్ఎస్ పార్టీ నుంచి చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిగా, సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డికి మరోసారి అవకాశం కేసీఆర్ కల్పించినా పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అభ్యర్థి కోసం బీఆర్ఎస్ నాయకత్వం పలుపేర్లు పరిశీలించింది. గతంలో అక్కడ నుంచి బరిలో నిలిచిన అనేక మంది సీనియర్లు మారిన రాజకీయ పరిస్థితులతో వెనకడుగు వేశారు. చివరకు తర్జన భర్జనపడి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) పేరును గులాబీ పార్టీ ఖరారు చేసింది. కాంగ్రెస్, టీడీపీల్లో పలు హోదాల్లో కాసాని పని చేసిన విషయం తెలిసిందే.
Telangana Lok Sabha Polls 2024 : పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రంజిత్ రెడ్డి, ఎట్టకేలకు పార్టీని వీడనున్నట్లు ఇవాళ ప్రకటించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కాంగ్రెస్‌లో చేరడంతో ఉత్కంఠకు తెర పడింది.
చేవెళ్ల నుంచి బరిలో దించేందుకు వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిని హస్తం పార్టీలోకి తీసుకొచ్చారు. ఆమెనే బలమైన నాయకురాలిగా స్థానిక నేతల మద్దతు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ రంజిత్ రెడ్డి చేరికతో ఆ స్థానంపై కొంత సందిగ్ధత నెలకొనే అవకాశం ఏర్పడవచ్చు. మరోవైపు ఈనెల 18న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(Congress Central Election Committee) సమావేశం జరగనుంది. ఆరోజు లేదా మరుసటి రోజున మిగిలిన స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
బీఆర్ఎస్కు వరంగల్ ఎంపీ గుడ్‌బై - కాంగ్రెస్ గూటికి చేరిన పసునూరి దయాకర్
బీఆర్ఎస్కు షాక్ - బీజేపీలో చేరిన మాజీ ఎంపీలు సీతారాం నాయక్, నగేశ్