ETV Bharat / politics

చేవెళ్లలో ఎగిరిన బీజేపీ జెండా - కొండా విశ్వేశ్వర్​ రెడ్డి ఘన విజయం - Chevella Lok Sabha Election Results 2024

Chevella Lok Sabha Election Results 2024 : చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి తన ప్రత్యర్థి రంజిత్​ రెడ్డిపై ఘన విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్​ ప్రారంభమైనప్పటి నుంచి స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చిన ఆయన, భారీ మెజార్టీతో గెలుపొందారు.

Chevella Lok Sabha Election Results 2024
Chevella Lok Sabha Election Results 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 7:21 PM IST

Chevella Lok Sabha Election Results 2024 : లోక్​సభ ఫలితాల్లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి, తన ప్రత్యర్థి రంజిత్​ రెడ్డిపై ఘన విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్​ ప్రారంభం నుంచి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయిన విశ్వేశ్వర్​ రెడ్డి విజేతగా నిలిచారు. చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి 3 పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే ప్రధానంగా పోటీ బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల మధ్యే నెలకొంది. కాంగ్రెస్​ అభ్యర్థి రంజిత్​ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి చివరకు ఆయనే విజేతగా నిలిచారు. 2019 ఎన్నికల్లో తన ప్రత్యర్థి రంజిత్​ రెడ్డి చేతిలో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన విశ్వేశ్వర్​ రెడ్డి, ఈ ఎన్నికల్లో ఆయనపైనే ఘన విజయం సొంతం చేసుకోవడం గమనార్హం.

తెలంగాణ రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి. మాజీ ఎంపీగా, తెలంగాణ ఉద్యమకారుడిగా వీటన్నింటి కంటే ధనిక రాజకీయ నేతల్లో ఒకరుగా పేరొందారు. ఇటీవల ఎన్నికల అఫిడవిట్​ సందర్భంగా ఆయన వార్తల్లోకి ఎక్కారు. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్​ వేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్​లో ఆయన తనకు రూ.4,568 కోట్లు ఉన్నట్లుగా ప్రస్తావించారు. ఈ ఆస్తుల్లో కొండా విశ్వేశ్వర్​ రెడ్డి పేరు మీద రూ.1178.72 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన సతీమణి సంగీతా రెడ్డి పేరు మీద రూ.3203.90 కోట్లు ఉన్నాయి.

ఇదీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి ప్రస్థానం : జస్టిస్​ కొండా మాధవరెడ్డి, జయలత దంపతులకు 1960 ఫిబ్రవరి 26 కొండా విశ్వేశ్వర్​ రెడ్డి జన్మించారు. ఆయన ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్​లో బీఈ పూర్తి చేశారు. విశ్వేశ్వర్​ రెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కొండా వెంకట రంగారెడ్డి మనవడే విశ్వేశ్వర్​ రెడ్డి. ఆంధ్రప్రదేశ్​ మాజీ ఉపముఖ్యమంత్రిగా కూడా వెంకట రంగారెడ్డి పనిచేశారు. విశ్వేశ్వర్​ రెడ్డి తండ్రి కూడా ఏపీ, మహారాష్ట్ర హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.

రాజకీయ ఆరంగేట్రం : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారు కొండా విశ్వేశ్వర్​ రెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్​ ఆహ్వానం మేరకు 2013లో ఆ పార్టీలో చేరారు. అనంతరం 2014 లో ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో బీఆర్​ఎస్​కు గుడ్​బై చెప్పి కాంగ్రెస్​ పార్టీలో చేరారు. కాంగ్రెస్​ పార్టీలో నాయకత్వం లోపం ఉందని భావించిన విశ్వేశ్వర్​ రెడ్డి 2021 మార్చిలో కాంగ్రెస్​కు రాజీనామా చేశారు. అనంతరం 2022లో బీజేపీలో చేరి అనతి కాలంలోనే కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా 2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.