ETV Bharat / politics

'కవిత విచారణకు సహకరించలేదు - తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారు' - delhi liquor scam case updates - DELHI LIQUOR SCAM CASE UPDATES

CBI Remand Report on MLC Kavitha Custody : ఎమ్మెల్సీ కవిత మూడు రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఆమెను నేడు రౌస్​ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్బంగా 11 పేజీలతో న్యాయస్థానంలో రిమాండ్​ అప్లికేషన్​ దాఖలు చేశారు. అందులో పలు కీలక విషయాలను వెల్లడించారు.

Delhi Liquor Scam Case Updates
CBI Remand Report on MLC Kavitha
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 12:43 PM IST

CBI Remand Report on MLC Kavitha Custody : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితను ఇటీవల కస్టడీకి తీసుకున్న సీబీఐ, గడువు ముగియడంతో నేడు తిరిగి రౌస్​ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన ఆధారాలను కవిత ధ్వంసం చేయడం, చెరిపేసే అవకాశం ఉందని ఆరోపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు 14 రోజుల రిమాండ్​ విధించాలంటూ 11 పేజీలతో న్యాయస్థానంలో అప్లికేషన్ దాఖలు చేసింది. ఈ రిమాండ్​ రిపోర్టులో పలు కీలక విషయాలను వెల్లడించింది.

Delhi Liquor Scam Case Updates : కవిత కస్టడీలో విచారణకు సహకరించలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. శరత్‌చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్లపై ఆమెను ప్రశ్నించామని పేర్కొంది. లేని భూమి ఉన్నట్టుగా చూపిన అమ్మకంపై కవిత నుంచి ఎలాంటి సమాధానం లేదని వివరించింది. ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు చెప్పారని వెల్లడించింది. మాగుంట శ్రీనివాసులు, బుచ్చిబాబుతో జరిగిన సమావేశాలు, శరత్‌ చంద్రారెడ్డి, విజయ్ నాయర్‌తో మీటింగ్​లపై ప్రశ్నించినా సరైన సమాధానాలు ఇవ్వకుండా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని ఆరోపించింది.

మరోసారి తిహాడ్ జైలుకు కవిత - ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ

సాక్షులను ప్రభావితం చేసే వ్యక్తి : ఈ క్రమంలోనే కవిత దర్యాప్తు, సాక్షులను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి అని, కేసుకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయడం, చెరిపేసే అవకాశం ఉందని సీబీఐ ఆరోపించింది. కేసుకు సంబంధించి డిజిటల్ పరికరాలు, పత్రాలు పరిశీలించాల్సి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరింది. వాదనలు విన్న న్యాయస్థానం, కవిత 9 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రౌస్​ అవెన్యూ కోర్టు అనుమతి - ఈ నెల 14 వరకు సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత

సీబీఐ కస్టడీ కాదు - బీజేపీ కస్టడీ : కోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు, కవితను తిరిగి తిహాడ్​ జైలుకు తరలించారు. అంతకు ముందు కోర్టుకు తీసుకెళ్లే సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని విమర్శించారు. బయట కమలం పార్టీ వాళ్లు మాట్లాడేదే, లోపల అధికారులు అడుగుతున్నారని మండిపడ్డారు. రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

సీబీఐ కస్టడీలో కవిత - వారి వాంగ్మూలాల ప్రకారం విచారణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.