KTR Demands To Take Up SRDP Works : హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఎస్ఆర్డీపీలో భాగంగా 42 కొత్త ప్రాజెక్టులు చేపట్టి, 36 పూర్తి చేసిందన్నారు. 2024లో మిగిలినవి పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
SRDP (Strategic Road Development Program) was a Flagship initiative for developing Hyderabad infrastructure under which KCR Govt had initiated 42 new projects & also completed 36 successfully
— KTR (@KTRBRS) August 27, 2024
The remaining projects were also to be completed in 2024
After the Congress Govt took… pic.twitter.com/fisogejHoZ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి కొనసాగుతున్న ఎస్ఆర్డీపీ పనులన్నీ మందగించాయని కేటీఆర్ తెలిపారు. గత 8నెలలుగా సరైన పర్యవేక్షణ, చెల్లింపులు లేవని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆమోదం పొందిన ఎస్ఆర్డీపీలో 3వ దశ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు మూసీ, ఎక్స్‌ప్రెస్ వే, కేబీఆర్ పార్క్ కింద టన్నెల్స్, ఫ్లైఓవర్‌లు, అండర్ పాస్‌లు సహా మిగిలిన వాటిని పూర్తి చేయాలన్నారు.
అవినీతి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమవుతోంది : అవినీతి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమవుతోందని కేటీఆర్ అన్నారు. ఉపాధ్యాయులు లేక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 15 రోజులుగా మూతపడి ఉన్న పాఠశాలల పరిస్థితిని ఉటంకించారు. అలాగే మహానగరంలోని డిస్పెన్సరీలో మందుల కొరతను ఎత్తిచూపుతూ, ఈనాడు పత్రికలోని కథనాన్ని ట్యాగ్ చేశారు. అవినీతి కాంగ్రెస్ పాలనలో అసమర్థ ముఖ్యమంత్రి వల్ల తెలంగాణ ఆగమవుతోందని, ఆయన ట్వీట్ చేశారు.
చెప్పేవారు లేక 43 పాఠశాలలు మూత - ఆదిలాబాద్ లో
— KTR (@KTRBRS) August 27, 2024
ఈ మాత్ర ఇవ్వలేరా - హైదరాబాద్ లో డిస్పెన్సరీలో పేషెంట్లకు మందుల కొరత
అవినీతి కాంగ్రెస్
అసమర్థ సీఎం
అగమైన తెలంగాణ#CongressFailedTelangana pic.twitter.com/TQtitx9jWF
అధికారిక నిర్ణయమా లేదా అనధికార నిర్లక్ష్యమా : కాకతీయ కళాతోరణం చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట వెలిసిన ఫ్లెక్సీపై కేటీఆర్ స్పందించారు. ఇది అధికారిక నిర్ణయమా లేదా అనధికార నిర్లక్ష్యమా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో మీకైనా తెలుసా అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ట్యాగ్ చేశారు. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు అయిన కాకతీయ తోరణం, చార్మినార్లతో ఈ వెకిలి పనులు మంచివి కాదన్నారు. ఈ కొత్త చిహ్నాన్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఆమోదించారని ప్రశ్నించారు. ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు దీని ఎందుకు వాడారన్నారు. దీనికి బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా?
— KTR (@KTRBRS) August 27, 2024
అసలు ఎం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా @TelanganaCS గారు?
తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన
కాకతీయ తోరణం, చార్మినార్ లతో ఈ వెకిలి పనులు ఏంటి ?
కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన… pic.twitter.com/Pywlv8Yvt0
రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టుకున్న కుటుంబాలే ఎక్కువ : కేటీఆర్