KTR Fires On Rahul Gandhi : రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడే లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడంలో విఫలమయ్యారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు కట్టుబడి ఉన్నామని చెబుతున్న ఆయన(రాహుల్ గాంధీ) ఇతర పార్టీల్లో గెలిచిన వారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.
KTR On Resignation Of MP Kesava Rao : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు రాజీనామా చేయడాన్ని 'ఎక్స్' వేదికగా కేటీఆర్ స్వాగతించారు. మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కూడా చేశారని ఆయన పరిస్థితి ఏమిటని అడిగారు. వీటిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మ్యానిఫెస్టో న్యాయపత్రం ఎలా అవుతుంది : రాజ్యాంగ స్ఫూర్తి అమలుపై ఆయన చిత్తశుద్ధిని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాము ఇచ్చిన మేనిఫెస్టోకు విరుద్ధంగా పార్టీలో చేర్చుకుంటూనే ఫిరాయింపులను అరికడతామంటూ చెబుతున్న రాహుల్ గాంధీ మాటల్ని దేశం ఎలా నమ్ముతుందని అన్నారు. అది అప్పుడు న్యాయపత్రం ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి తమ మేనిఫెస్టోపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
" కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు రాజీనామాను స్వాగతిస్తున్నాను. కానీ బీఆర్ఎస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతేమిటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాము ఇచ్చిన మేనిఫెస్టోకు విరుద్ధంగా పార్టీలో చేర్చుకుంటూనే ఫిరాయింపులను అరికడతామంటున్న మీ(రాహుల్ గాంధీ) మాటల్ని దేశం ఎలా నమ్ముతుంది" అని కేటీఆర్ తన ట్వీట్ ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
సీనియర్ నేత కె.కేశవరావు ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆయన నిన్న దిల్లీలో బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌పై చెప్పి, కాంగ్రెస్ గూటిలో చేరారు.