BRS Public Meeting In Karimnagar Today : కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఇవాళ లోక్‌సభ ఎన్నికల కదనభేరీని మోగించనున్నారు. ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభ ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలో తిరిగి పట్టు సాధించాలని బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
బీఆర్ఎస్ కంచుకోట అయిన కరీంనగర్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2024) చుక్కెదురైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లకు గాను 12 సీట్లను గెలుచుకున్న గులాబీ పార్టీ 2023లో మాత్రం చతికిలపడింది. కేవలం ఐదింటిని మాత్రమే అత్తెసరు మెజారిటీతో సాధించి ఉనికి చాటుకుంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కరీంనగర్ వేదికగా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
వాస్తవానికి గత నెలలో నల్గొండ జిల్లాలో పెట్టిన సభ కృష్ణా నదీ జలాల వాటకు సంబంధించింది కాగా కరీంనగర్ కదనభేరీ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభ శంఖారావానికి నాందిగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏ పథకమైనా ఉద్యమమైనా కరీంనగర్ నుంచి ప్రారంభించి కేసీఆర్ విజయం సాధించారని ఇదే సెంటిమెంట్‌తో ఎస్ఎస్ఆర్ మైదానంలో సభ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
మరో సమరానికి మానుకోట సిద్ధం- బీజేపీ గూటిలోకి చేరేందుకు సిద్ధమైన సీతారాం నాయక్
"పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎన్నో గొప్పగొప్ప కార్యక్రమాలు చేపట్టింది. రైతు బంధు కార్యక్రమం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా రైతులకు పంటలు పండే విధంగా గొప్ప గొప్ప కార్యక్రమాలు కేసీఆర్ చేపట్టారు. ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్ నుంచి ప్రచారం మొదలుపెడుతున్నాం. పార్లమెంట్లో ప్రజాగళం విప్పడానికి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలి." -గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
KCR Karimnagar Kadanabheri Sabha : కరీంనగర్ లోక్‌సభ స్థానంలోనూ 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కేసీఆర్‌కు కుడి భుజంగా ఉన్న వినోద్ కుమార్ ఓటమితో దిల్లీ సంబంధాలకు బీటలు వారాయి. అయితే రాష్ట్రంలో అధికారం కోల్పోయినా మెజారిటీ ఎంపీ స్థానాలను గెలిచి పార్టీకి పూర్వ వైభవం తేవడంతో పాటూ కార్యకర్తల్లో జోష్ నింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే కరీంనగర్ నుంచి కధన భేరి పేరుతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
అందులో భాగంగానే పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సభ విజయవంతం చేయాలని పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. నల్గొండ సభలో అధికార కాంగ్రెస్ పార్టీ సహా ముఖ్యమంత్రి , మంత్రులపై నిప్పులు చెరిగిన కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల గండం- పోటీకి అభ్యర్థులు విముఖత
భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి