ETV Bharat / politics

'దొడ్డు వడ్లకు బోనస్​ ఇవ్వాలి' - నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్​ఎస్​ నిరసనలు - BRS protest to bonus for grain - BRS PROTEST TO BONUS FOR GRAIN

BRS Chief KCR Fires on Congress : దొడ్డు వడ్లకు బోనస్​ ఇవ్వాలని నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్​ఎస్​ నిరసనలు చేపట్టనుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన వడ్లకు ప్రతి క్వింటాల్​కు రూ.500 బోనస్​ హామీ ఏం అయిందని ప్రశ్నించింది. ఈ విషయంపై కాంగ్రెస్​ ప్రభుత్వంపై కేసీఆర్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

BRS Protest Give Bonus for Grain
BRS Protest Give Bonus for Grain (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 16, 2024, 8:28 AM IST

BRS Protest Give Bonus for Grain : నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దొడ్డు వడ్లకు కూడా బోనస్​ ఇవ్వాలనే డిమాండ్​తో బీఆర్​ఎస్​ నేతలు నిరసనలు చేపట్టనున్నారు. లోక్​సభ ఎన్నికలకు ముందు వడ్లకు ప్రతి క్వింటాకు రూ.500లు బోనస్​ ఇస్తామని కాంగ్రెస్​ ప్రకటించింది. ఎన్నికలు ముగిసిన తెల్లారి కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్​ ఇస్తామని చెప్పడం అన్నదాతలను వంచించడమేనని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ధ్వజమెత్తారు. దొడ్డు వడ్లకు బోనస్​ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని ఆయన మండిపడ్డారు.

తెలంగాణలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్​ ప్రభుత్వం ఇలా నిర్ణయించడమేంటని కేసీఆర్​ ప్రశ్నించారు. ఓట్లు డబ్బాలో పడగానే కాంగ్రెస్​ వాళ్లకు రైతుల అవసరం తీరిందని అందుకే నాలిక తిప్పేశారని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ విమర్శించారు. ఎప్పటి మాదిరిగానే నయ వంచనకు పూనుకున్నారని మండిపడ్డారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్​ ఇస్తాం అన్న మాట ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే ఆ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవారని తెలిపారు. హక్కులను సాధించేందుకు బీఆర్​ఎస్​ ఎల్లప్పుడు వారి పక్షాన కొట్లాడుతుందని చెప్పారు. రైతులకు భరోసా కల్పించేందుకు నిరసనలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాల వద్దకు బీఆర్​ఎస్​ శ్రేణులు వెళ్లి వారికి అండగా నిలవాలని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ పేర్కొన్నారు.

Farmers Protest Over Paddy Procurement : అలాగే రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల కల్లాలు, మిల్లులు వద్ద ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రోడెక్కారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్​ మండలంలోని రైతులు గత ఐదు రోజుల నుంచి గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని నిరసనకు దిగారు. 40 లారీలకు పైగా ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందని, వడ్లను ఎఫ్​సీఐ కేంద్రాలకు తరలించి 25 రోజులు అవుతున్న ఎలాంటి తూకం జరగడం లేదన్నారు. ఈ క్రమంలో రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు.

మరోవైపు నిర్మల్​, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని రైతులు కూడా రోడ్లపైకి వచ్చి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. మిల్లుల వద్ద ఉంచిన ధాన్యం అకాల వర్షానికి తడిచిపోయిందని లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో భువనగిరి జిల్లా రైలులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి : రేవంత్​ రెడ్డి - CM Revanth Reddy Review Meeting

వడగళ్ల వానతో తడిసి ముద్దయిన ధాన్యం - చేతికందిన పంట పోయిందని రైతుల ఆవేదన - Paddy Crop Damage In Warangal

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.