ETV Bharat / politics

నల్గొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగురేసేందుకు పక్కా ప్లాన్ - ఆ ఇద్దరిపైనే కేసీఆర్ ఆశలు - lok sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

BRS Nalgonda MP Candidates : సుదీర్ఘ కసరత్తు అనంతరం నల్గొండ బీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేశ్‌ను నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ శనివారం ప్రకటించారు. తొలిసారి ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్న వీరిద్దరూ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

Three Main Parties Focus on Nalgonda Seat
BRS Nalgonda MP Candidates
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 1:37 PM IST

BRS Nalgonda MP Candidates : నల్గొండ, భువనగిరి స్థానాలకు పలువురు సీనియర్ నేతలు పోటీ పడినా సుదీర్ఘ కసరత్తు తర్వాత రెండు స్థానాలకు కంచర్ల కృష్ణారెడ్డిని, క్యామ మల్లేశ్‌ను కేసీఆర్ ప్రకటించారు. నల్గొండ నుంచి పోటీ చేసేందుకు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి ముందు నుంచి ఏర్పాట్లు చేసుకోగా వివిధ కారణాలతో ఆయన మధ్యలోనే తప్పుకున్నారు. మొదటి నుంచి పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నల్గొండ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి టిక్కెట్ వరించింది. నల్గొండ స్థానానికి ఇప్పటికే బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది.

Bhuvanagiri BRS MP Candidate : భువనగిరి స్థానాన్ని బీసీలకు కేటాయిస్తారనే ప్రచార నేపథ్యంలో ఇక్కడి నుంచి బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి టిక్కెట్ ఇచ్చామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భువనగిరి ఎంపీ టిక్కెట్ క్యామ మల్లేష్‌కు దక్కడంతో ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశించిన జిట్టా బాలకృష్ణారెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్ తదితరులు ఏ మేరకు పార్టీకి సహకారం అందిస్తారా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతుంది. ఈ రెండు పార్లమెంటు స్థానాలకు పార్టీ ఇన్‌ఛార్జీ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యవహరించనున్నారు. తమను గుర్తించి పార్టీ టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్‌కు (KCR ON Lok Sabha Elections) కృష్ణారెడ్డి, మల్లేష్ వేర్వేరుగా కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్‌ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ - Hyderabad BRS MP Candidate

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి (BJP MP Candidates) శానంపూడి సైదిరెడ్డికి బలమైన పోటీని ఇచ్చి గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన కంచర్ల కృష్ణారెడ్డి స్వస్థలం చిట్యాల మండలం ఉరుమడ్ల. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోదరుడు మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో పాటు టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో జరిగిన ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ఇంఛార్జీగా పనిచేశారు.

సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంలో గెలుపు బీఆర్​ఎస్​దే : ​పద్మారావు గౌడ్​ - Lok Sabha Polls 2024

Three Main Parties Focus on Nalgonda Seat : భువనగిరి నుంచి పోటీ చేస్తున్న క్యామ మల్లేశ్‌ స్వస్థలం ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ. తొలుత యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2018లో కాంగ్రెస్ నుంచి టిక్కెట్ రాకపోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరారు. నల్గొండ పార్లమెంట్‌కు సంబంధించి రెండు పార్టీల అభ్యర్థులను ప్రకటించగా వారు గెలుపే దిశగా ఎన్నికల ప్రచారం మొదలుకానుంది.

16 లోక్​సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు - పెండింగ్​లో హైదరాబాద్‌ సీటు - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.