BRS MP Pasunuri Dayakar joins Congress : బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరుగా గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా వరంగల్ బీఆర్‌ఎస్(BRS) ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌ల నేతృత్వంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహేష్‌కుమార్ గౌడ్ పార్టీ కండువా కప్పి ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. సీఎం అదేశాల మేరకు తాము ఎంపీ పసునూరి దయాకర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
MP Pasunuri Dayakar quits BRS : ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్(CONGRESS) పార్టీలోకి చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నా, కేసీఆర్ వాళ్లను బెదిరించి రానివ్వకుండా ఆపినట్లు దయాకర్ ఆరోపించారు. తెలంగాణలో ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో సమస్యలొస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియదని ఆయన విమర్శించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులందరికి అందుబాటులో ఉందని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిందన్నారు.
Pasunuri Dayakar fires on BRS : గడిచిన 23 ఏండ్ల నుంచి ఉద్యమంలో కార్యకర్తగా పని చేస్తున్నట్లు ఎంపీ పసునూరి దయాకర్ తెలిపారు. తాను రెండు సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ, మంత్రి కొండా సురేఖ దగ్గర క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేశానని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తోందని, అందుకే వాటిపట్ల ఆకర్షితుడునయినట్లు తెలిపారు. ఉద్యమంతో సంబంధం లేని కడియం శ్రీహరి కూతురుకి ఎంపీ టికెట్ ఇచ్చినట్లు ఆరోపించారు.
బీఆర్ఎస్కు మరో షాక్ - కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్ రెడ్డి !
వరంగల్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి పార్టీని భ్రష్టు పట్టించారని దయాకర్ విమర్శించారు. ఎంపీగా తనకు ప్రోటోకాల్ ఇవ్వలేదని, ఇతర అందరూ ఎంపీలకు ప్రోటోకాల్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. తనకు సమాచారం ఇవ్వకుండానే సమావేశాలు ఏర్పాటు చేసేవారని, తనపట్ల వివక్షత చూపేవారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ గల కార్యకర్తగా పనిచేస్తానని పేర్కొన్నారు.
"ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాను. గడిచిన 23 ఏండ్ల నుంచి ఉద్యమంలో కార్యకర్తగా పని చేశాను. నేను రెండు సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ, మంత్రి కొండా సురేఖ దగ్గర క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేశాను. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తోంది. అందుకే వాటిపట్ల ఆకర్షితుడునయి పార్టీలోకి చేరాను". - పసునూరి దయాకర్, వరంగల్ ఎంపీ
'ఏపీలో మోదీని ప్రశ్నించే గొంతులు లేవు - పాలించే నాయకులు కాదు ప్రశ్నించే గొంతు కావాలి'
తెలంగాణలో జంపింగ్ జపాంగ్ జంపాక్ జంపాక్ - ఎవరెవరు ఎటువైపు వెళ్తున్నారో?