ETV Bharat / politics

నల్గొండ, భువనగిరి ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ - BRS MP Candidates List 2024

BRS MP Candidates List 2024 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో జోరు సాగిస్తోంది. ఇవాళ సికింద్రాబాద్ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించిన ఆ పార్టీ, కాసేపటికే నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

BRS MP Candidates List 2024
BRS MP Candidates List 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 23, 2024, 5:43 PM IST

Updated : Mar 23, 2024, 6:48 PM IST

BRS MP Candidates List 2024 : తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇవాళ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ను ప్రకటించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్, కాసేపటికే మరో రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేశ్‌ను, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి (Nalgonda BRS MP Candidate) పేర్లను ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల సంఖ్య 16 స్థానాలకు చేరింది. ఇక హైదరాబాద్ పార్లమెంట్‌ స్థానం (Hyderabad BRS MP Seat) మాత్రమే పెండింగ్‌లో ఉంది. త్వరలోనే ఈ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.

Nalgonda BRS MP Candidate : నల్గొండ లోక్‌సభ స్థానానికి మొదటి నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేరు బాగా వినిపించినా, చెరుకు సుధాకర్ కూడా రేసులో ఉండటంతో ఇద్దరిలో ఎవరిని అవకాశం వరిస్తుందోనని ఉత్కంఠగా ఉండేది. ఇక తాజాగా కంచర్ల కృష్ణారెడ్డి వైపే స్థానిక నేతలంతా మొగ్గు చూపడంతో కేసీఆర్ కూడా ఆయనకే జై కొట్టారు. దీంతో ఇన్నాళ్లూ నల్గొండ బరిలో బీఆర్ఎస్ నుంచి ఎవరు నిలుచుంటారన్న ఉత్కంఠకు ఎట్టకేలకు ఇవాళ తెర పడింది.

సికింద్రాబాద్‌ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ - Secunderabad BRS MP Candidate

Bhuvanagiri BRS MP Candidate : మరోవైపు భువనగిరి లోక్‌సభ స్థానానికి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, సీనియర్ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్​తో పాటు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి పేర్లు వినిపించాయి. లోక్‌సభ అభ్యర్థిత్వాల విషయమై ఆయా నియోజకవర్గాల పరిధిలోని నేతలతో కేసీఆర్​ సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు, కార్యకర్తలు క్యామ మల్లేశ్‌కే ఓటు వేయడంతో అధిష్ఠానం ఆయనే పేరే ప్రకటించింది.

మరోవైపు సికింద్రాబాద్ సీటుకు కూడా ఇవాళ కేసీఆర్ అభ్యర్థిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. పార్టీలో మొదటి నుంచి విధేయుడిగా ఉంటూ, స్థానిక నేతలతో సఖ్యంగా మెలుగుతూ, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌ (Secunderabad MP Candidate)కు కేసీఆర్ ఎంపీ టికెట్‌ను ఇచ్చారు. ఆయన పేరును కేసీఆర్ ఖరారు చేయడంతో ఏకగ్రీవంగా స్థానిక నియోజకవర్గ నేతలంతా సానుకూలతను వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 16 స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటించినట్లైంది.

మరో 2 లోక్​సభ స్థానాలకు బీఆర్​ఎస్​ అభ్యర్థుల ప్రకటన​ - మెదక్ బరిలో మాజీ ఐఏఎస్ - BRS Lok Sabha Candidates 202

ఇప్పటివరకు ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..

  1. సికింద్రాబాద్‌ - పద్మారావుగౌడ్‌
  2. కరీంనగర్‌ - వినోద్‌కుమార్‌
  3. పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్‌
  4. ఖమ్మం - నామా నాగేశ్వరరావు
  5. మహబూబాబాద్‌ - మాలోత్‌ కవిత
  6. చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్
  7. వరంగల్‌ - డాక్టర్ కడియం కావ్య
  8. జహీరాబాద్‌ - అనిల్‌కుమార్‌
  9. నిజామాబాద్‌ - బాజిరెడ్డి గోవర్ధన్‌
  10. నాగర్‌కర్నూల్‌ - ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
  11. మెదక్‌ - వెంకట్రామిరెడ్డి
  12. మహబూబ్‌నగర్‌ - మన్నె శ్రీనివాస్‌రెడ్డి
  13. మల్కాజిగిరి - రాగిడి లక్ష్మారెడ్డి
  14. ఆదిలాబాద్‌ - ఆత్రం సక్కు
  15. నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి
  16. భువనగిరి - క్యామ మల్లేశ్

బీఆర్ఎస్ ఖేల్​ ఖతమ్ - నెక్స్ట్ బీజేపీకి అదే గతి : సీఎం రేవంత్ రెడ్డి - Lok Sabha Elections 2024

లోక్​సభ ఎన్నికల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు - పార్టీలు మారుతున్న నేతలు

Last Updated : Mar 23, 2024, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.