ETV Bharat / politics

నేడు హైదరాబాద్​కు ఎమ్మెల్సీ కవిత - ఘనస్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు సిద్ధం - MLC Kavitha Will Arrive Hyderabad

MLC Kavitha Will Arrive Hyderabad : దిల్లీ మద్యం కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌ రానున్నారు. సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు హాజరైన తర్వాత మధ్యాహ్నం దిల్లీ నుంచి బయలుదేరుతారు. తీహాడ్ జైలు నుంచి విడుదలైన అనంతరం హస్తినలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బస చేశారు. తాను కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదన్న కవిత న్యాయపరంగా, రాజకీయంగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టంచేశారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 7:00 AM IST

Updated : Aug 28, 2024, 7:05 AM IST

MLC Kavitha Will Arrive Hyderabad
MLC Kavitha Will Arrive Hyderabad (ETV Bharat)

MLC Kavitha Will Arrive Hyderabad Today : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన భారత రాష్ట్ర సమితి నేత, శాసనమండలి సభ్యురాలు కవిత 164 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహాడ్ జైలు నుంచి బయటకు వచ్చారు. సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన పూచీకత్తును కవిత భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించారు. వాటిని అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు కవిత విడుదలకు అనుమతిస్తూ తీహాడ్ జైలుకు వారెంట్ జారీ చేశారు.

భావోద్వేగానికి గురైన కవిత : విడుదల ప్రక్రియ అనంతరం రాత్రి 9 గంటల తర్వాత కవిత తీహాడ్ జైలు నుంచి బయటకు వచ్చారు. అప్పటికే అక్కడికి కవిత భర్త, కుమారుడు, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎంపీలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున చేరుకున్నాయి. జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే కుమారుడు, భర్త సహా సోదరుడు కేటీఆర్‌ ఆలింగనం చేసుకొని కవిత ఉద్వేగానికి లోనయ్యారు. తాను కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదని కవిత పేర్కొన్నారు. ప్రజల కోసం మరింతగా పోరాడతానని చెప్పారు.

"18 ఏళ్లు నేను రాజకీయాల్లో ఉన్నాను. పాలిటిక్స్​లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. వ్యక్తిగతంగా నాకు, నాకుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5 నెలలు దూరంగా ఉండటం చాలా ఇబ్బందికరమైన విషయం. నాకుటుంబాన్ని ఇబ్బందులు పాల్జేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం.- కవిత, బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ

ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణుల ఏర్పాట్లు : తీహాడ్‌ జైలు విడుదలైన తర్వాత దిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లి నేతలతో కవిత సమావేశమయ్యారు. అండగా నిలిచినవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాత్రి కార్యాలయంలోనే బస చేశారు. సీబీఐ కేసు విషయంలో రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు ఇవాళ వర్చువల్‌గా హాజరు కానున్నారు. మధ్యాహ్నం కవిత, కుటుంబ సభ్యులు, నేతలు హైదరాబాద్ బయలుదేరనున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కవితకు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవున్నాయి.

ఫోన్‌ మారిస్తే నేరం చేసినట్లా? - కవిత పాత్ర ఉందని చెప్పేందుకు ఆధారాలేంటి? : ఈడీ, సీబీఐలపై సుప్రీం అసహనం - Supreme Expressed Displeasure on ED

కవితపై వెంటనే ట్రయల్ ప్రారంభించండి - రౌస్​ అవెన్యూ కోర్టుకు ఈడీ విజ్ఞప్తి - KAVITHA JUDICIAL Remand EXTENDED

Last Updated : Aug 28, 2024, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.