Harish Rao Open Letter to Revanth Reddy : ఉపాధ్యాయులకు పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో శుక్రవారం రోజున సీఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో హరీశ్ రావు లేఖ రాశారు. ప్రభుత్వం తాము చేశామంటున్న అంశాలు బీఆర్ఎస్ అధికారంలో తీసుకున్న నిర్ణయాలని లేఖలో పేర్కొన్నారు. భాషా పండితులు, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని 2017లోనే బీఆర్ఎస్ నిర్ణయించి అందుకు తగిన అనుమతులు పూర్తి చేసిందని చెప్పారు.
ఎస్టీజీలకు ప్రమెషన్లు ఇవ్వండి : గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్లను కూడా 2023లోనే బీఆర్ఎస్ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తుచేశారు. ప్రాథమిక పాఠశాలలకుగానూ 10వేల ప్రధానోపాధ్యాయ పోస్టులను బీఆర్ఎస్ సర్కారు మంజూరు చేసిందని అయితే ఇప్పటివరకూ వారిని పాఠశాలలకు కేటాయించలేదని లేఖలో తెలిపారు. ఆ ప్రక్రియను తక్షణం పూర్తి చేసి ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇవ్వాలని , ఉపాధ్యాయుల ముఖాముఖిలోనే వారికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై స్ఫష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించాలన్న ఆయన పెండింగ్ డీఏలు, పాత పెన్షన్ స్కీం అమలు, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల క్రమబద్ధీకరిణ, మధ్యాహ్న భోజన పథకానికి పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి అంశాలపై ఈ సభలోనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక పాఠశాల విద్యార్థులకు గతంలో అందించిన ఉదయం పూట ఉపాహారం పథకాన్ని తిరిగి కొనసాగించాలని లేఖలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పాలి : హరీశ్‌రావు - Harish Rao Reaction on CM Comments
సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తాం : హరీశ్‌రావు - BRS Leader Harish Rao Chit Chat