ETV Bharat / politics

లోక్​సభలో నిలదీయాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి : హరీశ్​రావు - Harish Rao Fires on Congress Party - HARISH RAO FIRES ON CONGRESS PARTY

BRS MLA Harish Rao Fires on Congress Party : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకలకే ప్రజలు అవకాశం ఇవ్వాలని మాజీమంత్రి హరీశ్‌రావు కోరారు. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ నేతలు ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన, వందరోజుల్లో అమలుచేస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.​

BRS MLA Harish Rao on Farmer Issues
Harish Rao Comments on Congress Schemes
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 3, 2024, 4:21 PM IST

BRS MLA Harish Rao Fires on Congress Party : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి మాజీమంత్రులు హరీశ్​రావు, జగదీశ్​రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన హరీశ్​రావు, అధికార పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Govt) క్వింటా వడ్లు 2,500 రూపాయలకు కొంటేనే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉంటుందని ఆయన అన్నారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి 500 రూపాయల బోనస్‌ ఇచ్చి వడ్లు కొంటామని చెప్పినట్లు గుర్తు చేశారు. మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మోసం చేసిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల నుంచి ఆడబిడ్డలకు రూ.10,000 బాకీ పడిందన్న ఆయన, అవి ఇచ్చిన తరువాతే ఓట్లు అడగాలని కాంగ్రెస్​కు సవాల్​ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ ఉద్దర మాటలు తప్ప, ఉద్ధరించే పనులు చేయలేదు : హరీశ్​ రావు - LOK SABHA ELECTIONS 2024

"గ్రామాల్లో రైతుల దగ్గరకు వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ, ఈ ఎన్నికల్లో రూ.2500కు క్వింటా వడ్లు కొంటేనే ఓటు అడిగే హక్కు ఉంటాది. లేకుంటే ఉండదనే విషయం చెప్పాలి. ఎన్నికలకు ముందు కొంటానని చెప్పి, అధికారంలోకి వచ్చాక మరిచారు. మీరు హామీ నెరవేర్చాకే ఊళ్లలోకి రావాలి, పార్లమెంట్​ ఎన్నికల కోసం ఓట్లు అడగాలి. మహాలక్ష్మి పేరు మీద మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్నారు. మేనిఫెస్టోలోని మొదటి హామీనే తుంగలో తొక్కి మోసం చేశారు."-హరీశ్​రావు, మాజీమంత్రి

Harish Rao Comments on Congress Schemes : వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పి అది కూడా నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతు బంధు ఇస్తామని, ఇప్పటి వరకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. రైతు బంధు వచ్చిన వారు కాంగ్రెస్​కు, రానివారు బీఆర్​ఎస్​కు ఓటు వేయాలని సూచించారు.

గులాబీ పార్టీ పార్లమెంట్​ ఎన్నికల్లో(Parliament Election) గెలవాలని, ప్రశ్నించే గొంతుకకు ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం కేసీఆర్ ఇచ్చారని గుర్తు చేసిన ఆయన, కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ప్రకటన నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగులకు రూ.4,000 ఇస్తానన్నారని, ప్రియాంక గాంధీ భువనగిరిలోనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని ప్రకటించిన మాటను గుర్తు చేశారు.

BRS Parliament Election Preparatory Meetings : ఆ పార్టీ మోసాలు ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. గులాబీ పార్టీ నుంచి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నలుగురు నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. భువనగిరి బీఆర్ఎస్ లోక్​సభ అభ్యర్థి క్యామ మల్లేశ్​కు ప్రజలంతా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

లోక్​సభలో నిలదీయాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి : హరీశ్​రావు

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్​రావు బహిరంగ లేఖ - రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్న - Harish Rao Open Letter to CM

రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నిరసనలు - వరి క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.