ETV Bharat / politics

'సంక్షేమ పథకాల బీఆర్​ఎస్​కే మద్దతు పలకాలి' - ఇంటింటి ప్రచారంలో ప్రజలకు నివేదిత విజ్ఞప్తి - CANTONMENT BYPOLL 2024 - CANTONMENT BYPOLL 2024

Cantonment BRS Candidate Niveditha Bypoll Campaign : సంక్షేమ పథకాల బీఆర్​ఎస్​కే ప్రజల మద్దతు ఉందని కంటోన్మెంట్​ ఉప ఎన్నిక బరిలో నిలిచిన బీఆర్​ఎస్​ అభ్యర్థి నివేదిత అన్నారు. ఆమె కంటోన్మెంట్​ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ శ్రేణులు పాల్గొన్నారు.

Cantonment BRS Candidate Niveditha Bypoll Campaign

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 4:56 PM IST

Updated : Apr 30, 2024, 7:42 PM IST

BRS MLA Candidate Niveditha Bypoll Campaign in Cantonment : కంటోన్మెంట్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​, బీజేపీ నాటకాలను ప్రజలు ఎవరూ నమ్మరని బీఆర్​ఎస్​ అభ్యర్థి నివేదిత తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోండా మార్కెట్​ డివిజన్​ పరిధిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల బీఆర్​ఎస్​ పార్టీకే కంటోన్మెంట్​ ప్రజలు మద్దతు పలకాలని అభ్యర్థి నివేదిత కోరారు.

కాంగ్రెస్​ పాలనలో నిరుపేదలను పట్టించుకోవడం లేదని రేవంత్ సర్కార్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో హడావిడి చేయడం తప్ప, వాటి అమలుపై దృష్టి పెట్టడం లేదని ధ్వజమెత్తారు. అందుకే కాంగ్రెస్​, బీజేపీలతో ఇక్కడి ప్రజలకు ఎలాంటి లాభం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం రాజీ లేకుండా పోరాటం చేసే సత్తా కేవలం గులాబీ పార్టీకే ఉందని చెప్పారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రజల ముందు ఉన్నాయని నివేదిత పేర్కొన్నారు. అందుకే అభివృద్ధి తమ నినాదం అని, ఈసారి ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ ప్రచారానికి జనమంతా జేజేలు పలికారు. శాలువలు, పూలమాలలతో నివేదితను సత్కరించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసు - ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతోనే ప్రమాదం!

సాయన్న కుమార్తె వెంటే కంటోన్మెంట్ ప్రజలు​ : గులాబీ పార్టీ వెన్నంటే ఉంటామని, సాయన్న కుమార్తెను గెలిపించుకుంటామని స్థానికులు ప్రతిన బూనారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో స్థానిక బీఆర్​ఎస్​ అధ్యక్షులు ఆకుల హరి, మార్కెట్​ కమిటీ మాజీ ఛైర్మన్​ టీఎన్​ శ్రీనివాస్​తో పాటు సీనియర్​ నాయకులు నరసింహ ముదిరాజ్​, దాసరి కర్ణకుమార్​, సృజన్​, వినయ్​, నారాయణ, రాము, జోడీ బ్రదర్స్​, మహిళా నాయకులు పాల్గొన్నారు.

"ఈరోజు కంటోన్మెంట్​లోని 150 డివిజన్​లో పాదయాత్ర చేస్తున్నాం. మా ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అందరూ కేసీఆర్​కే ఓటేస్తామని ముందుకు వస్తున్నారు. ఇక్కడ ఉన్న వారందరికీ డబుల్​ బెడ్​రూం ఇళ్లు వచ్చాయి. అలాగే కొంతమందికి అఫ్లికేషన్​లు పెండింగ్​లో ఉన్నాయి. అలాగే సాయన్న చేసిన అభివృద్ధి చాలా ఉంది. అనేక అభివృద్ధి పనులను ఇక్కడ చేశాము. ఆ అభివృద్ధి పనులే బీఆర్​ఎస్​ను గెలిపిస్తాయి." - నివేదిత, బీఆర్​ఎస్​ కంటోన్మెంట్ ఎమ్మెల్యే​ అభ్యర్థి

సంక్షేమ పథకాల బీఆర్​ఎస్​కే మద్దతు పలకాలి' - ఇంటింటి ప్రచారంలో ప్రజలకు నివేదిత విజ్ఞప్తి

మే 13న కంటోన్మెంట్​ ఉప ఎన్నిక : ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని పటాన్​చెరు ఓఆర్​ఆర్​పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్​ఎస్​ కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్​ఆర్​ వద్ద రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్​ను ఢీకొని అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణించడంతో సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ అసెంబ్లీ స్థానం ఖాళీ ఏర్పడింది. ఈ స్థానం కోసం బీఆర్​ఎస్​ పార్టీ లాస్య నందిత సోదరి నివేదితను అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్​ నుంచి నారాయణ శ్రీ గణేశ్​, బీజేపీ నుంచి వంశా తిలక్​ పోటీ పడుతున్నారు. మే 13న ఉప ఎన్నికకు పోలింగ్​ జరగనుంది.

కంటోన్మెంట్ బీఆర్ఎస్​ అభ్యర్థినిగా నివేదిత - అధికారికంగా ప్రకటించిన కేసీఆర్ - BRS Cantonment MLA Candidate

కంటోన్మెంట్‌ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడానికి అంతా సహకరించాలి : నివేదిత - Cantonment by Election

Last Updated : Apr 30, 2024, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.