KTR Reacts on Police Attack on Dalit Woman : షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలిసుల దాడిని ఖండించిన బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా అని మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ పాలన, ఇదేనా ప్రజాపాలన అన్న ఆయన దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు. మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా అని ధ్వజమెత్తారు.
దళిత మహిళపై ఇంత దాష్టీకమా?
— KTR (@KTRBRS) August 5, 2024
ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?
దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?
మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?
నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..!
ఇంత కర్కశత్వమా... సిగ్గు సిగ్గు..!
కొడుకు ముందే చిత్ర… pic.twitter.com/d9ERDZnHJo
నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత కర్కశత్వమా సిగ్గు సిగ్గు అన్న కేటీఆర్, కొడుకు ముందే చిత్ర హింసలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలోని అని ప్రశ్నించారు. మహిళలంటే ఇంత చిన్నచూపా అని అన్నారు. ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు మరోవైపు దాడులు, దాష్టీకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
యథా రాజా తథా ప్రజా అన్నట్లు ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఆడబిడ్డలపై లాఠీఛార్జీలు, దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదన్న కేటీఆర్, వాళ్లను గౌరవించకపోయినా ఫర్వాలేదన్న ఆయన ఇలా దౌర్జన్యాలు మాత్రం చేయకండని సూచించారు.
'నేను కూడా దళిత బిడ్డనే' - ఎస్సై ఆత్మహత్యపై స్పందించిన సీఐ భార్య - ASWARAOPETA SI SUICIDE INCIDENT
షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమని ఈ ఘటనను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోదని తెలిపారు. దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత వ్యతిరేక మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని కేటీఆర్ అన్నారు.
పోలీస్ అధికార దుర్వినియోగంకు నిదర్శనం : షాద్‌నగర్‌లో పోలీసుల అధికార దుర్వినియోగం, మానవ హక్కుల ఉల్లంఘనను మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. దళిత మహిళ సునీతను పోలీసులు చేయని నేరాన్ని ఒప్పుకోవాలని థర్డ్ డిగ్రీ ఉపయోగించడం హేయమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమాండ్ చేయకుండా, మహిళా కానిస్టేబుల్ లేకుండా, కన్నకొడుకు ముందే సునీతను చిత్రహింసలకు గురి చేయడం పోలీసు అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మానవ హక్కులను కాపాడడంలో విఫలమైందని, రాష్ట్రంలో పెరుగుతున్న పోలీసుల అధికార దుర్వినియోగమే దీనికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళపై థర్డ్ డిగ్రీ ఉపయోగించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో మానవ హక్కులను పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్‌రావు కోరారు.
చెన్నూరులో దళిత కార్యకర్త ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్ - KTR Election Campaign