BRS Leaders Migration in Telangana 2024 : అధికారం కోల్పోయిన అనంతరం భారత్ రాష్ట్ర సమితిని నేతలు వరుసగా వీడుతూ వస్తున్నారు. బీఆర్ఎస్‌లో అవకాశం రాదని నిర్ణయించుకొని పలువురు నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. ఇందులో సిట్టింగ్ ఎంపీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు ఉన్నారు. అందులో కొందరికి ఇతర పార్టీల్లో లోక్‌సభ టికెట్లు కూడా దక్కాయి. మరికొందరు అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని మరోసారి సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డికి ఇవ్వాలని భారత్ రాష్ట్ర సమితి మొదట నిర్ణయించినప్పటికీ ఆయన పోటీకి ఆసక్తి చూపలేదు. దీంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. తాను పార్టీలోనే కొనసాగుతానన్న వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ (MP Pasunuri Dayakar Joins Congress) సైతం హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.
ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే టైమ్ చెప్పండి - బీఆర్ఎస్కు ఐదో మనిషి కూడా మిగలడు : సీఎం రేవంత్
BRS Leaders Join to Congress and BJP : తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య ఇటీవల వరంగల్ బీఆర్ఎస్ సమావేశానికి వచ్చి తాను పార్టీ మారబోనని చెప్పిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శ్రేణులను గందరగోళపరచడానికి ఈ విధమైన ప్రచారం చేస్తున్నారంటూ చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని అభ్యర్థి ఎవరైనా వారి గెలుపుకోసం పని చేస్తానని ఆయన తెలిపారు. కానీ తాజా పరిణామాల్లో ఆరూరి రమేశ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇన్నాళ్లుగా ఎంపీలు, మాజీలకే పరిమితమైన వలసల జాబితాలో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా చేరారు.
బీఆర్ఎస్కు మరో షాక్ - కాంగ్రెస్ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్
భారత్ రాష్ట్ర సమితి శాసనసభ్యులు పార్టీని వీడతారాన్న ప్రచారం చాలా రోజులుగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసినప్పుడల్లా ఈ ప్రచారం జోరందుకుంటోంది. అయితే సదరు ఎమ్మెల్యేలు మాత్రం తాము మర్యాదపుర్వకంగా, అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్లు చెప్పారు. తాము పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. అయితే రెండు రోజుల క్రితం రేవంత్‌రెడ్డి పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీని కలిసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రచారాన్ని నిజం చేస్తూ హస్తం పార్టీ కండువా కప్పుకొన్నారు. దీంతో మొదటి ఎమ్మెల్యే గులాబీ పార్టీని వీడినట్లైంది.
గులాబీ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తున్న పరిణామాలు : ఎమ్మెల్యేలు కలిసినపుడు తనకు అన్ని విషయాలు చెబుతున్నారని ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తే తాము అండగా ఉంటామని మాట ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం వ్యాఖ్యానించారు. మరుసటి రోజే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలన్నీ గులాబీ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల గండం- పోటీకి అభ్యర్థులు విముఖత
కేసీఆర్ ప్లాన్ ఛేంజ్ - బహిరంగ సభలకు బైబై - బస్సు యాత్రలు, రోడ్ షోలతోనే ఎన్నికల ప్రచారం