ETV Bharat / politics

'గొర్రెల పంపిణీలో అక్రమాలపై స్పందించిన ఈడీ - పేపర్ లీక్​లపై ఎందుకు స్పందించడం లేదు' - BRS leader Vinod Kumar accused BJP - BRS LEADER VINOD KUMAR ACCUSED BJP

BRS leader Vinod Kumar accused BJP : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పరీక్షల్లో లీక్​లు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. లీక్​లన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే జరుగుతున్నాయని వెల్లడించారు. గొర్రెల పంపిణీపై స్పందించిన ఈడీ, పేపర్ లీక్​లపై ఎందుకు స్పందించడం లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు.

BRS leader Vinod Kumar
BRS leader Vinod Kumar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 1:59 PM IST

Updated : Jun 24, 2024, 2:15 PM IST

BRS Leader Vinod Kumar Fires on BJP : నీట్ నుంచి తప్పుకొని, రాష్ట్రమే వైద్య విద్య ప్రవేశాలు నిర్వహించుకునేలా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. నీట్ కుంభకోణం దేశంలోనే పెద్దదని, రూ.కోట్లలో డబ్బు చేతులు మారినట్లు తెలుస్తోందని ఆయన ఆరోపించారు.

ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోనే ఈ వ్యవహారాలన్నీ వెలుగు చూస్తున్నాయని వినోద్ కుమార్ మండిపడ్డారు. గొర్రెల పంపిణీలో అవినీతి జరిగితే ఈడీ వస్తే, 24 లక్షల మంది జీవితాలతో ఆటలాడిన వ్యవహారంలో ఈడీ ఎందుకు రావడం లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఈడీ ఏం చేస్తోందని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. కింగ్ పిన్ 20 ఏళ్ల నుంచి పేపర్ లీకేజీలో సిద్ద హస్తుడని కథనాలు వస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షా పత్రం లీక్ అయిందని బండి సంజయ్ ఆ రోజు నానా మాటలు మాట్లాడారన్న వినోద్ కుమార్, 24 లక్షల మంది జీవితాలతో చెలగాటమాడిన బీజేపీ ప్రభుత్వం ఎంత పరిహారం ఇస్తుంది? ఎవరిని బర్తరఫ్ చేస్తారని వినోద్ కుమార్ నిలదీశారు.

మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని వినోద్ కుమార్ డిమాండ్​ చేశారు. లీకేజీలు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయోనని ప్రొఫెసర్లు, విద్యావేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఉత్తర భారతం వాళ్లు ర్యాంకులతో ఇక్కడకు వస్తున్నారని, కానీ అక్షరం ముక్క కూడా రావడం లేదని ప్రొఫెసర్లు చెప్తున్నారని వివరించారు.

డబ్బులున్న వాళ్లు పేపర్లు కొంటున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం తమది సుపరిపాలన అని చెబుతుంది. ఎంపీల ప్రమాణ స్వీకారం తర్వాత పార్లమెంట్​లో ఈ అంశంపై చర్చ జరగాలి. ఎన్డీయే భాగస్వామి చంద్రబాబు నాయుడు కూడా స్పందించాలి. నీట్ వ్యవహారంలో స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డిని నేను ఇప్పటికే కోరాను. నీట్​లో ఉండబోమని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయాలి. వినోద్ కుమార్, మాజీ ఎంపీ

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం - కాచిగూడలో ఉద్రిక్తత - Students Union Leaders Protest

తమిళనాడు కూడా ఇదే వైఖరితో ఉందని, మిగతా రాష్ట్రాలు కూడా కలిసి వస్తే బాగుంటుందని వినోద్​ కుమార్​ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని ఆరోపించారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం చేయాలని, పేపర్ లీక్ చేసే వారికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. నీట్ రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకునేలా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

పరీక్ష ముందురోజే ఫోన్​కు PDF- నీట్ పేపర్ లీకేజీపై CBI దర్యాప్తు ముమ్మరం- అధికారులపై స్థానికులు దాడి - NEET UG 2024 Paper Leak

Last Updated : Jun 24, 2024, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.