ETV Bharat / politics

కాంగ్రెస్​లోకి కొనసాగుతున్న వలసలు - బీఆర్ఎస్​కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా - BRS Leaders Resigns

BRS Leader Teegala Krishna Reddy Joins Congress : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరికలు పెరుగుతున్నాయి. సముచిత గుర్తింపు కల్పిస్తే చేరతామంటూ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్​కు చెందిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డి కారు పార్టీని వీడి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 27న చేవెళ్లలో జరగబోయే సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు అనితారెడ్డి వెల్లడించారు.

Teegala Krishna Reddy Join in Congress
BRS Leader Teegala Krishna Reddy Join in Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 7:48 PM IST

Updated : Feb 25, 2024, 8:41 PM IST

BRS Leader Teegala Krishna Reddy Joins Congress : లోక్​సభ ఎన్నికలకు ముందు గులాబీ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒకరికొకరు పార్టీని వీడుతున్నారు. తాజాగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్ తీగల అనితారెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరితోపాటు ఎంపీటీసీలు, సర్పంచులు కూడా రాజీనామా సమర్పించారు. ఈ నెల 27న చేవెళ్లలో జరగబోయే సభలో ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తీగల కృష్ణారెడ్డి వెల్లడించారు.

ప్రజాసంక్షేమం కోసం ఈ ప్రాంత ప్రజలకు సేవచేయాలని ఉద్దేశంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు పిలుపు మేరకు 1983లో ప్రజా జీవితంలోకి వచ్చానని తీగల కృష్ణారెడ్డి తెలిపారు. గతంలో హుడా ఛైర్మన్​గా, నగర మేయర్​గా, ఎమ్మెల్యేగా పని చేసినట్లు చెప్పారు. 2014లో బీఆర్ఎస్​లో చేరిన తాను పార్టీ ప్రతిష్ఠ కోసం పని చేశానని, కొంత కాలంగా పార్టీ విధేయులును, కార్యకర్తలను విస్మరిస్తుండడంతో కలత చెంది రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

Rangareddy ZP Chairperson Anita Joins Congress : అదే కోవలో రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్ తీగల అనితారెడ్డి కూడా తమ కార్యకర్తల మనోభావాలను ఏకీభవిస్తూ భారత్ రాష్ట్ర సమితి(BRS Party) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలోనే తీగల కాంగ్రెస్‌లో చేరి, మహేశ్వరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం ముమ్మరంగా జరిగింది. అయితే ఎమ్మెల్యే టికెట్‌ దక్కకపోవడంతో వెనక్కి తగ్గారు.

GHMC Deputy Mayor Joined Congress : మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ సైతం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ(మానకొండూర్‌), జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌లతో కలసి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రాజేశ్వర్‌ కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీలతా శోభన్‌రెడ్డి దంపతులు ఇవాళ హస్తం పార్టీలో చేరారు.

మరోవైపు నాగర్‌కర్నూల్‌ బీఆర్ఎస్ లోక్‌సభ సన్నాహక సమావేశాలకు, ఆ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ రాములు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమావేశ బ్యానర్లపై ఆయన ఫొటోలు ఉన్నా, ఆయనకు ఈ సమావేశాలకు సంబంధించిన ఆహ్వానం అందనట్టుగా తెలుస్తోంది. ఎంపీ రాములు పార్టీ మారతారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాగా కాంగ్రెస్‌ పార్లమెంట్ టికెట్ల(Parliament Tickets) కోసం పలువురు నేతలు, విశ్రాంత అధికారులు, ఇతరులు దరఖాస్తు చేశారు. వారు కూడా హస్తం గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చే నాటికి చేరికలు పర్వం మరింత జోరందుకుంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ కండువా కప్పుకున్న​ పట్నం సునీత మహేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్

తెలంగాణలో ప్రభుత్వ కొలువుల జాతర షురూ - ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ ఫోకస్​

Last Updated : Feb 25, 2024, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.