ETV Bharat / politics

'బీఆర్​ఎస్​ నేతలనే చేర్చుకుని అభ్యర్థులు ప్రకటించే దుస్థితికి బీజేపీ, కాంగ్రెస్​ వచ్చాయి' - Niranjan Reddy Fires on Revanth

BRS Leader Niranjan Reddy Comments on BJP and Congress : బీఆర్​ఎస్​ నేతలనే చేర్చుకుని అభ్యర్థులను ప్రకటించే దుస్థితికి బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు వచ్చాయని మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్​లోని మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ, కాంగ్రెస్​లపై విమర్శల వర్షం కురిపించారు.

Niranjan Reddy Comments on BJP and Congress
BRS Leader Niranjan Reddy Comments on BJP and Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 7:25 PM IST

BRS Leader Niranjan Reddy Comments on BJP and Congress : కేసీఆర్​ మీద బురదజల్లడమే కాంగ్రెస్​, బీజేపీ ఎజెండా తప్ప పదేళ్లలో తెలంగాణకు చేసిన మేలు గురించి ఒక్కసారి మాట్లాడడం లేదని మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. కాంగ్రెస్​, బీజేపీ తెలంగాణ కోసం తమదైన ఎజెండా ప్రజల ముందు పెట్టి ఆమోదం కోరడం లేదన్నారు. తెలంగాణకు చేసిన మేలు గురించి చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు కేసీఆర్​ విసిరిన సవాల్(KCR challenge Amit Shah)​ను స్వీకరించకుండా తోక ముడిచారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా నిరంజన్​ రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల నుంచి బీజేపీ నేతలు, మోదీ, అమిత్​ షా కేసీఆర్​ మీద నిందలు మోపడం తప్ప ఒక్కటీ నిరూపించడం లేదని విమర్శించారు. బీఆర్​ఎస్​ నేతలనే చేర్చుకుని అభ్యర్థులుగా ప్రకటించే దుస్థితిలో బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. మీరు అంత బలంగా ఉంటే అభ్యర్థులు ఎందుకు కరవయ్యారని ఎద్దేవా చేశారు. పార్టీని వీడుతున్న నేతల గురించి ప్రజాక్షేత్రంలో ప్రజలే తేలుస్తారని అన్నారు.

ఎందుకు బీజేపీ, కాంగ్రెస్​కు ప్రజలు ఓట్లు వేయాలి : పొరపాటున కాంగ్రెస్​, బీజేపీకు ఓటేస్తే మనకు మనం దహించుకున్నట్లే అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు ఈ విషయంలో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్​ విపరీత హామీలు అమలు చేయాలని విపక్షంగా బీఆర్​ఎస్(BRS Question to Congress)​ నిలదీయకుంటే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని అన్నారు. దౌర్జన్యంతో రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీల హక్కులను హరించేలా కాంగ్రెస్​, బీజేపీ పని చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని, తెలంగాణను ఏ రంగంలో అగ్రభాగాన నిలిపారని కాంగ్రెస్​, బీజేపీకు ప్రజలు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. అన్ని రంగాలను అధోగతి పాలు చేసినందుకు బీజేపీ పార్టీకి ప్రజలు ఓట్లు వేయాలా అంటూ మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

"గుడ్లు పీకి గోళీలు ఆడుతాం, తొండలు వదులుతాం, మానవబాంబులం అవుతాం అనడానికి కాంగ్రెస్​కు సిగ్గుపడాలి. అంత ఉబలాటంగా ఉంటే ఓ సినిమా తీసుకుని సంతోషపడండి. రేవంత్​ రెడ్డి కాంగ్రెస్​ పార్టీకి సలాం చేస్తూ బీజేపీకు గులాం చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏక్​నాథ్​ షిండే వస్తాడన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్​ మాటల గురించి స్పందించే దమ్ము రేవంత్​ రెడ్డికి లేదా?. మోదీ వస్తే ఎందుకు వెళ్లి వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నారు." - నిరంజన్​ రెడ్డి, బీఆర్​ఎస్​ నేత

Ex Minister Niranjan Reddy Fires on Revanth Reddy : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న కాంగ్రెస్​ నినాదం హాస్యాస్పదమని మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డి ఎద్దేవా చేశారు. కేవలం నెల రోజుల్లో ఎన్నికలు పెట్టుకుని రేవంత్​ ప్రధానిని ఎలా కలుస్తారని కాంగ్రెస్​ పార్టీ నేతలే అంటున్నారని పేర్కొన్నారు. చేతనైతే నిపుణుల సలహాలు తీసుకుని సీఎం రేవంత్​, కేసీఆర్​ కంటే ఎక్కువ పని చేసి చూపించాలని అప్పుడు అభినందిస్తామని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీజేపీ నేతల గురించి మాట్లాడే దమ్ము కాంగ్రెస్​ నేతలకు ఉందా అంటూ ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది: కేసీఆర్‌

ఆసక్తిరేపుతున్న ఆదిలాబాద్‌ ఎంపీ సీటు - జోరందుకున్న రాజకీయ వలసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.