ETV Bharat / politics

త్వరలోనే స్టేషన్​ ఘన్​పూర్​కు ఉపఎన్నిక - రాజయ్య గెలుపు ఖాయం : కేటీఆర్ - Joining BRS in the presence of KTR

KTR Fires on CM Revanth Reddy : ప్రస్తుతం దేశంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం కష్టంగా ఉందని బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​ అన్నారు. ఆనాడు కేవలం 14 సీట్ల స్వల్ప తేడాతో అధికారం కోల్పోయామని చెప్పారు. త్వరలోనే స్టేషన్​ ఘన్​పూర్​లో ఉపఎన్నికల వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణభవన్​లో జరిగిన చేరికల కార్యక్రమంలో కేటీఆర్​ మాట్లాడారు.

KTR Fires on CM Revanth Reddy
KTR Fires on CM Revanth Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 4:31 PM IST

Updated : Aug 15, 2024, 5:05 PM IST

BRS Leader KTR Comments on Congress Party : త్వరలోనే స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తుందని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ జోస్యం చెప్పారు. ఈ ఉపఎన్నికలో బీఆర్​ఎస్​ నుంచి రాజయ్య గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. హైకోర్టులో తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. మిగతా వాళ్లపై నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో జరిగిన చేరికల కార్యక్రమంలో కేటీఆర్​ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కొంతమంది వ్యక్తులు బీఆర్​ఎస్​ కండువాను కప్పుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ, సభాపతి రాజకీయ పక్షపాతం చూపిస్తూ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం కష్టంగా ఉందన్నారు. 14 సీట్ల స్వల్ప తేడాతో కోల్పోయామని చెప్పారు. అందులో సగం గెలిచిన కథ వేరేలా ఉండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికలు రెండు కూటముల మధ్య నడిచిందని చెప్పారు. గత ఎన్నికల ఓటమితో భయపడాల్సిన, బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్​ అబద్ధాల హామీలకు మోసపోయారని వాపోయారు.

స్టేషన్​ ఘన్​పూర్​ ప్రజలు, తాము వేరే రకంగా మోసపోయామని కేటీఆర్​ వివరించారు. కేసీఆర్​ ఉన్నప్పుడు కరెంటు పోతే వార్త, రేవంత్​ రెడ్డి వచ్చాక కరెంటు ఉంటే వార్త అని ఎద్దేవా చేశారు. ఊసరవెల్లులు రాజ్యం నడిపితే తొండలు, ఉడతలు రాక ఏం వస్తాయని ఆరోపించారు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పుకుంటున్నారని విమర్శించారు. మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కేవలం ఉద్యోగం వచ్చిందంటే రాహుల్​ గాంధీకి ప్రతిపక్షనేత, రేవంత్​ రెడ్డికి ముఖ్యమంత్రి ఉద్యోగం మాత్రమే వచ్చిందని బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​ అన్నారు. రెండు లక్షల ఉద్యోగాల మాట బోగస్​ అని యువతకు అర్థం అయిందన్నారు. మైసూర్​ బజ్జీలో మైసూర్​ ఎంత వాస్తవమో, జాబ్​ క్యాలెండర్​లో జాబ్​లు అంతే అని ఎద్దేవా చేశారు.

త్వరలోనే పార్టీ కార్యక్రమాల్లో కేసీఆర్ : త్వరలోనే కేసీఆర్​ పార్టీ కార్యక్రమాలు ఇస్తారని కేటీఆర్​ చెప్పారు. కొద్ది రోజుల్లో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారన్నారు. కేసీఆర్​ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టుకు సీఎం రేవంత్​ రెడ్డి వెళ్లి రిబ్బన్​ కట్​ చేశారని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పినట్లు రూ.75 కోట్లతో 1.25 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే మాట వాస్తవం అయితే ఇక నుంచి అన్ని ప్రాజెక్టులకు అలాగే చేయాలని కోరారు. పీఆర్​ స్టంట్లు, నాటకాలతో ప్రజలను ఎక్కువ రోజులు మోసం చేయలేరని కేటీఆర్​ హితవు పలికారు.

కాంగ్రెస్​ నేతలు ప్రజల్లో తిరగలేరు : స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అని బీసీ డిక్లరేషన్​లో చెప్పారు. బీసీలకు మోసం చేసి రిజర్వేషన్లు పెంచకుండానే రేవంత్​ రెడ్డి స్థానిక ఎన్నికలు పెడతారు. బీజేపీ నేతలు కాంగ్రెస్​, రేవంత్​ రెడ్డి చెప్పినట్లే నడుచుకుంటున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్​ నేతలు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉంటుంది.

'రాష్ట్రం నుంచి సమర్థుడైన నాయకుడు ఒక్కరు దొరకలేదా' - రాజ్యసభకు మను సింఘ్వీ ఎంపికపై కేటీఆర్

మార్పు అంటే 8 నెలల్లో రూ.50 వేల కోట్ల అప్పు చేయడమేనా? : కేటీఆర్ - KTR on Telangana Debt

Last Updated : Aug 15, 2024, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.