ETV Bharat / politics

సీఎంకు దిల్లీ చక్కర్లు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడమే తెలుసు - ప్రజలు అవసరం లేదు : కేటీఆర్​ - ktr tweet Gopanpally flyover issue

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 6:48 PM IST

KTR Fires on Telangana Congress Govt : సీఎం రేవంత్​ రెడ్డిపై ఎక్స్​ వేదికగా బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎంకు దిల్లీ బాస్​ల చుట్టూ, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడంపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ఆరోపించారు. నిర్మాణం పూర్తైన గోపన్​పల్లి ఫ్లైఓవర్​ ఎందుకు ప్రారంభించలేదని సీఎంను ప్రశ్నించారు.

KTR Fires on Telangana Congress Govt
KTR Fires on Telangana Congress Govt (ETV Bharat)

BRS Leader KTR Comments on CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి దిల్లీ చక్కర్లు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో లేదని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ధ్వజమెత్తారు. హైదరాబాద్​ నగర శివారులోని గోపన్​పల్లి ఫ్లైఓవర్​ నిర్మాణం పూర్తి అయినా ప్రారంభించకపోవడాన్ని ఆయన ఎక్స్​ వేదికగా ప్రస్తావించారు. పనికిమాలిన ప్రభుత్వం, అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందని కేటీఆర్​ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

నల్లగండ్ల, గోపన్​పల్లి, తెల్లాపూర్​, చందానగర్​ వాసులకు ట్రాఫిక్​ కష్టాలు తగ్గేలా, ఉపశమనం కల్గించేలా బీఆర్​ఎస్​ ప్రభుత్వం గోపన్​పల్లి ఫ్లైఓవర్​ను చేపట్టి పూర్తి చేసిందని కేటీఆర్​ పేర్కొన్నారు. పూర్తి అయిన ఫ్లైఓవర్​ ప్రారంభోత్సవం కోసం వేచి చూస్తోందని తెలిపారు. ఫ్లైఓవర్​ను ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. గోపన్​పల్లి ఫ్లైఓవర్​ను ప్రారంభించేందుకు సీఎం రెడ్డి సమయం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఆయన దిల్లీ బాస్​ల చుట్టూ చక్కర్లు కొట్టడం, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రజల సమస్యల కన్నా కూడా వ్యక్తిగత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎక్స్​ వేదికగా కేటీఆర్​ ఆరోపణలు చేశారు. ప్రజల కోసం గోపన్​పల్లి ఫ్లైఓవర్​ను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. లేదంటే ప్రజలే ఆ ఫ్లైఓవర్​ను ప్రారంభించే పరిస్థితి వస్తుందని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ స్పష్టం చేశారు.

పదేళ్ల పాలనలో సర్కారు వైద్యానికి జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్​ : అలాగే సర్కారు దవాఖానాలపై కేటీఆర్​ ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు. పదేళ్ల పాలనలో సర్కారు వైద్యానికి జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్​ సర్కార్​ అని కొనియాడారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే దశాబ్దాల దుస్థితి నుంచి ఛలో పోదాం పదరో సర్కారు దవాఖానాకు అనే ధీమానిచ్చింది బీఆర్​ఎస్​ ప్రభుత్వం అని అన్నారు. కానీ గద్దెనెక్కిన ఆరునెలల్లోనే సర్కారు దవాఖానాల్లో కనీసం మందు గోళీలు దొరకని దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. ఇలా దిగజార్చింది రేవంత్​ సర్కార్​ కాదా అని ప్రశ్నించారు. పాలన గాలికొదిలేసిన కాంగ్రెస్​ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నగరానికి ఏమైంది? - కాంగ్రెస్ హయాంలో 'బ్రాండ్ హైదరాబాద్' ఎందుకు మసకబారుతోంది? - KTR ON CRIME RATE IN HYDERABAD

బల్లి పడిన టిఫిన్లు, ఎలుకలు తిరిగే చట్నీలతో - కాంగ్రెస్ పెద్ద మార్పే తెచ్చింది: కేటీఆర్ - KTR SLAMS CONGRESS OVER FOOD POISON

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.