ETV Bharat / politics

కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసినప్పుడల్లా ప్రజలను మోసం చేసింది : కేటీఆర్‌ - KTR Comments on Congress Party - KTR COMMENTS ON CONGRESS PARTY

KTR Comments on Congress Party : ప్రజల మనసులో విషం నింపి మోదీ రాజకీయాలు చేస్తున్నారని, ముస్లింలకు, పేదలకు పదేళ్లలో ఆయన చేసిందేంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు. గులాబీ, కమలం పార్టీలు ఒక్కటేనంటున్న కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టిన కేటీఆర్‌, అలాగైతే కవిత జైళ్లో ఎందుకుంటుందని ప్రశ్నించారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ బీఆర్​ఎస్​ మైనార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

BRS Leader KTR Fires on Congress
KTR Comments on Congress Party (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 3:22 PM IST

Updated : May 8, 2024, 7:57 PM IST

BRS Leader KTR Fires on Congress : ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆలోచించాలని, ఎవరికి ఓటు వేస్తే ప్రయోజనం కలుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్‌ కోరారు. 10 ఏళ్ల క్రితం బడేభాయ్ నరేంద్ర మోదీ అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారన్నారు. మనుషుల మనసులో విషం నింపి రాజకీయాలు చేస్తున్న మోదీకి ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్​ పార్టీని నమ్మి ఓటేసినప్పుడల్లా ప్రజలను ఆ పార్టీ మోసం చేసిందని విమర్శించారు.

మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ బీఆర్​ఎస్​ మైనార్టీ కార్యకర్తల సమావేశం హైదరాబాద్ కుషాయిగూడలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కేటీఆర్, కేసీఆర్​ హయాంలో మైనార్టీల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కేసీఆర్ హిందువుగా ఆయన ధర్మాన్ని పాటించారు కానీ రాజకీయాల్లో మతాన్ని వాడుకోలేదని అన్నారు. రంజాన్ తోఫా మీకు వచ్చిందా? మహిళలకు రూ. 2500 వచ్చాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత ఆరు గ్యారంటీలు నమ్మి ప్రజలు మనల్ని ఓడించారు. కానీ హైదరాబాద్​ ప్రజలు నమ్మలేదని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ పాలనలో 204 మైనార్టీ స్కూల్స్ పెట్టాం : కాంగ్రెస్ వచ్చిన నాలుగున్నర నెలల్లోనే కరెంట్, నీళ్ల కష్టాలు మొదయ్యాయని కేటీఆర్ దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో మత సామరస్యాన్ని కాపాడారే కానీ మత రాజకీయం చేయలేదని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో 204 మైనార్టీ స్కూల్ పెట్టామని, వందకు పైగా మైనార్టీ మహిళల కొరకు పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. అలానే ఒక్కో విద్యార్థిపై ఏటా లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేశామన్నారు.

కాంగ్రెస్​కు గతంలో ఎన్నో ఏళ్లు ప్రజలు అవకాశం ఇచ్చినా, దేశంలో ఎందుకు ఇంకా ముస్లింలు పేదరికంలోనే ఉన్నారని ప్రశ్నించారు. మైనార్టీలు, పేదలు సంక్షేమం కోసం నిజాయితీగా పని చేశామన్నారు. కమలం, గులాబీ పార్టీలు ఒక్కటేనంటూ ప్రచారం చేస్తోన్న కాంగ్రెస్‌ మాటలను తిప్పికొట్టిన కేటీఆర్‌, బీజేపీతో తమకు దోస్తీ ఉంటే కవిత జైల్లో ఉంటుందా అని ప్రశ్నించారు. మోదీని వ్యతిరేకించడం వల్లే కవిత, కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌ను జైల్‌లో పెట్టారని దుయ్యబట్టారు.

KTR Comments on Opposition Party Leaders : కమల దళాన్ని ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీల నేతలకే ఉందని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పార్లమెంట్​ ఎన్నికల్లో 10-12 సీట్లు ఇస్తే చాలని, మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్, సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్ ఎన్నికలు అయిపోగానే వాళ్లు ఇక్కడ ఉండరని, ఈ ప్రాంత వ్యక్తిగా రాగిడి లక్ష్మారెడ్డి మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని తెలిపారు.

కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసినప్పుడల్లా ప్రజలను మోసం చేసింది : కేటీఆర్‌ (ETV Bharat)

మాకు 12 సీట్లు ఇస్తే, గుంపు మేస్త్రీ ఇంటికి వెళ్లడం ఖాయం : కేటీఆర్ - lok sabha elections 2024

ఆరు గ్యారంటీలంటూ కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠం చూపెట్టింది : కేసీఆర్ - KCR ELECTION CAMPAIGN IN MEDAK

Last Updated : May 8, 2024, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.