BRS Krishank Letter To CM Revanth Fake Alcohol : రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టొద్దని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేసేందుకు ఎలాంటి మద్యం కంపెనీలు ప్రతిపాదన పెట్టలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మొదట చెప్పారని సోం డిస్టిలరీస్ సంస్థకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని తామే బయటపెట్టిన తర్వాత నిజాన్ని ఒప్పుకొన్నారని లేఖలో పేర్కొన్నారు. సోం డిస్టిలరీస్‌కు అనుమతులు వాస్తవమే కానీ, తనకు ఎలాంటి సమాచారం లేదని మంత్రి ప్రకటన ఇచ్చినట్లు గుర్తు చేశారు. దీనిపై ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
సోం డిస్టిలరీస్ సంస్థ ప్రభుత్వ సంస్థల వద్ద రుణాలు తీసుకొని ఎగ్గొడుతూ, కల్తీ మద్యం వ్యాపారం చేయడంలో ప్రఖ్యాతి గాంచింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సంస్థ కల్తీ బీరును ధ్వంసం చేసే చిత్రాన్ని లేఖతో పాటు జతపరిచాను. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు. దయచేసి కమీషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరు తయారు చేసే కంపెనీలకు అనుమతులు ఇచ్చి ఆరోగ్యానికి హానికరమైన కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురావొద్దు. సోం డిస్టిలరీస్‌కు ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేస్తూ విక్రయదారుల ఆరోగ్యాన్ని కాపాడుతారని భావిస్తున్నాను. - క్రిశాంక్, బీఆర్ఎస్ నేత
ఆచితూచి చూసి అనుమతులు ఇవ్వండి : కాగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం కొరతతో మందు బాబులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. దీన్నే ఆసరాగా చేసుకుని కొందకు ఆగంతకులు నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వీటిపట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. అలాగే కొత్త ప్రభుత్వం నూతన బ్రేవరీలకు అనుమతులు ఇవ్వొద్దనే విజ్ఞప్తులు వస్తున్నాయి. విమర్శలకు లొంగకుండా కల్తీ మద్యం లేని బ్రేవరీలను అనుమతించాలని కోరుతున్నారు. కల్తీ మద్యం తాగడం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుందని, వాటిని సప్లై చేసే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో బీర్ల కొరత - క్లారిటీ ఇచ్చిన ఆబ్కారీ శాఖ - BEERS SHORTAGE IN TELANGANA