BRS Leader Kavitha Into CBI Custody : రెండు రోజులపాటు సీబీఐ కస్టడీలో ఉండనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారం చేసుకును దర్యాప్తు సంస్థ అధికారులు ప్రశ్నించనున్నారు. రౌస్ అవెన్యూ న్యాయస్థానం ఆదేశాలతో కవిత శుక్రవారం సీబీఐ కార్యాలయానికి తరలించారు. మద్యం విధానం, అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా దర్యాప్తు సంస్థ పేర్కొంది. కస్టడీలో ఉన్న కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి అధికారులు వైద్య పరీక్షలు చేయించనున్నారు. సాయంత్రం 6గంటల నుంచి 7గంటల వరకు ఆమె న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు భర్త అనిల్, కేటీఆర్ సహా పీఏ శరత్, న్యాయవాది మోహిత్‌రావు కవితను కలిసే అవకాశం ఉంది.
సీబీఐ ప్రశ్నించడంపై కవిత పిటిషన్ - విచారణ ఈ నెల 26కు వాయిదా - mlc kavitha delhi liquor scam case
Kavitha CBI Arrest : దిల్లీ మద్యం కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీ నుంచి సీబీఐ ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికే ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించిన సీబీఐ, లోతుగా విచారించేందుకు 5 రోజులు కస్టడీ కోరుతూ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్రూవర్ల వాంగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది.
కోర్టులో వాదనలు వినిపించిన సీబీఐ తరఫు న్యాయవాది మద్యం కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అని తెలిపారు. విజయ్ నాయర్, తదితరులతో కలిసి పథకం రూపొందించారని అన్నారు. అందుకు దిల్లీ, హైదరాబాద్‌లో సమావేశాలు జరిగాయని చెప్పారు. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఆమె పాత్ర స్పష్టంగా ఉందని చెప్పారు. రూ.100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు అందించారని వివరించారు. కవిత సూచనతో మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ.25 కోట్లు అందజేశారని ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించారని స్పష్టం చేశారు.
రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి - ఈ నెల 14 వరకు సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత - MLC Kavitha CBI Custody
ఈ మేరకు వాదనలు విన్న కోర్టు, ఈ నెల 14 వరకు కస్టడీకి అనుమతిచ్చింది. మరోవైపు అంతకుముందు రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు చుక్కెదురైంది. సీబీఐ ప్రశ్నించడం, అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది.