ETV Bharat / politics

కాంగ్రెస్​ ప్రభుత్వం చేసే పనులకు - హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్​ గుర్తు పెట్టుకోవాలి : హరీశ్​ రావు - brs meet HYDRA Victims

Harish Rao Fires on Cong Govt : కాంగ్రెస్​ ప్రభుత్వంపై బీఆర్​ఎస్​ నేత హరీశ్​రావు ఫైర్​ అయ్యారు. కాంగ్రెస్​ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్​ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. బీఆర్​ఎస్​ పార్టీ లీగల్​ సెల్, మూసీ బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Harish Rao Fires on Cong Govt
Harish Rao Fires on Cong Govt (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2024, 2:27 PM IST

Updated : Sep 29, 2024, 2:36 PM IST

BRS leader Harish Rao Meet HYDRA Victims : కాంగ్రెస్​ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి, బుల్డోజర్​ గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు సూచించారు. సీఎం రేవంత్​ రెడ్డి కట్టుకున్న ఇళ్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి ఇల్లు ఎఫ్​టీఎల్​లో ఉందని తెలిపారు. బాధితుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పర్యటించింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఇళ్లను పరిశీలించి, బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం బాధితులతో బీఆర్​ఎస్​ బృందం భేటీ అయింది.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్​ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని సూచించారు. పేదలకు ఇళ్లు లేకుండా చేయడమే రేవంత్​ రెడ్డి లక్ష్యంగా ఉందని ఆరోపించారు. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా ఉంటామని స్పష్టం చేశారు. మూసీని ఆక్రమించి భవనాలు కట్టిన వారిని అడ్డుకోవట్లేదని అసహనం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్​ రెడ్డి హిట్లర్​లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

"పేదలకు ఇళ్లు లేకుండా చేయడమే రేవంత్​ రెడ్డి లక్ష్యం. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా ఉంటాం. మూసీని ఆక్రమించి భవనాలు కట్టిన వారిని అడ్డుకోవట్లేదు. కాంగ్రెస్​ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్​ గుర్తు పెట్టుకోవాలి." - హరీశ్​ రావు, మాజీ మంత్రి

సీఎం మూసీపై ప్రతిపాదన విరమించుకోవాలి : బీఆర్​ఎస్​ పార్టీ లీగల్​ సెల్​ బాధితులకు అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్​ రావు హామీ ఇచ్చారు. రేవంత్​ రెడ్డి తమ్ముడికి ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ భవన్​ అందరికీ ప్రజాభవన్​ అర్ధరాత్రి వచ్చినా అండగా ఉంటామని చెప్పారు. రేవంత్​ రెడ్డి మౌనం వీడి స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. రేవంత్​ రెడ్డి మూసీపై ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్​ చేశారు. గాంధీ ఆసుపత్రిలో సరైన వైద్యం అందట్లేదు, గతంలో కాంగ్రెస్​, టీడీపీ ప్రభుత్వాలు అనుమతిచ్చాయని తెలిపారు. చర్యలు తీసుకోవాలనుకుంటే గత కాంగ్రెస్​, టీడీపీ ప్రభుత్వాలపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులు ధైర్యంగా ఉండాలని హరీశ్​ రావు చెప్పారు.

హరీశ్​ రావు అవగాహన ఉన్న వ్యక్తి : బీఆర్​ఎస్​ నేత హరీశ్​రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ నేత, ఎమ్మెల్యే దానం నాగేందర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను బీఆర్​ఎస్​ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బీఆర్​ఎస్​ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. హరీశ్​ రావు అవగాహన ఉన్న వ్యక్తి అని చెప్పారు. హరీశ్​ రావు ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ప్రభుత్వానికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసునని వివరించారు.

'రియల్ ఎస్టేట్ వ్యాపారిలా రేవంత్ తీరు - బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోం' - HARISH RAO FIRES ON CM REVANTH

'సోదరుడికి నోటీసులు ఇచ్చి, పేదల ఇంటికి బుల్డోజర్లా? - అఖిలపక్ష సమావేశం తర్వాత మూసీపై ముందుకెళ్లండి' - HARISH RAO MEET HYDRA VICTIMS

Last Updated : Sep 29, 2024, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.