ETV Bharat / politics

ఇంటర్​ కాలేజీలు ప్రారంభమైన పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు - ఇదేనా ప్రజాపాలన? : హరీశ్​రావు - Harish Rao Tweet on Junior Colleges - HARISH RAO TWEET ON JUNIOR COLLEGES

Harish Rao Tweet on Telangana Junior Colleges : రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభించి 19 రోజులు అవుతున్నా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యను అందించడంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వైఫల్యమైందని ఆరోపించారు. ఇంటర్​ కాలేజీల్లో గెస్ట్​ ఫ్యాకల్టీని రెన్యువల్​ చేయాలని డిమాండ్​ చేస్తూ ఆయన ఎక్స్​ వేదికగా ట్వీట్ చేశారు.

Telangana Junior Colleges Lecturer Posts
Harish Rao Tweet on Telangana Junior Colleges (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 19, 2024, 10:29 AM IST

Harish Rao Tweet on Telangana Junior Colleges : రాష్ట్ర సమస్యలపై నిత్యం తన వంతు గళం విప్పుతున్న నేతల్లో మాజీ మంత్రి హరీశ్​రావు ఒకరు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తున్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు తేడా చూపుతూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఒక్కోసారి క్షేత్ర పర్యటనలు చేస్తూ ప్రజల దగ్గరకు వెళుతున్నారు. మరోసారి సామాజిక మాధ్యమం ద్వారా లోపాలను చూపుతూ సర్కార్​ను ప్రశ్నించారు. తాజాగా తన అధికార ఎక్స్​ వేదికగా జూనియర్​ కళాశాలల సమస్యలపై స్పందిస్తూ ట్వీట్​ చేశారు.

Harish Rao on Junior Colleges Students Issue : రాష్ట్రంలో జూనియర్​ కళాశాలలు ప్రారంభమై నేటికి 19 రోజులు అవుతున్నా ఇప్పటివరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కూడా అందించకపోవడంపై హరీశ్​రావు ఎక్స్​ వేదికగా మండిపడ్డారు. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్​ సర్కార్​కి విద్య మీద, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 422 జూనియర్​ కళాశాల్లో 1,60,000 మంది పేద, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారని గుర్తు చేశారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం వైఫల్యమైందని ధ్వజమెత్తారు.

ఉద్యోగాలపై కాంగ్రెస్ మాట అప్పుడలా ఇప్పుడిలా : హరీశ్‌రావు - Harish Rao Fires On Congress

Telangana Junior Colleges Lecturer Posts : రాష్ట్రంలో కొన్ని ఇంటర్​ కళాశాలల్లో మొదటి సంవత్సరం జీరో అడ్మిషన్స్​ నమోదవడంపై హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో రేవంత్ సర్కార్​ దృష్టి పెట్టి ఇంటర్మీడియట్​ విద్యను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు, జూనియర్​ కాలేజీల్లో విధులు నిర్వర్తించే 1,654 గెస్ట్​ ఫ్యాకల్టీలను రెన్యువల్​ చేయాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన ఇంటర్​ కళాశాలల్లో అధ్యాపకుల పోస్ట్​లు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేస్తూ ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ​

గ్రూప్‌-1 మెయిన్స్ 1:100 ప్రకటించేలా ప్రభుత్వం ఒత్తిడి తేవాలి - హరీశ్‌రావుకు వినతిపత్రం - Group1 candidates plea to harishrao

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.