ETV Bharat / politics

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం బాధాకరం : హరీశ్​రావు - Harish Rao Tweet On Law And Order

Harish Rao Tweet On Law And Order : కాంగ్రెస్​ ప్రభుత్వంపై బీఆర్ఎస్​ నేత, మాజీ మంత్రి హరీశ్​ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్థకమయిందన్నారు. ఈ మేరకు 'ఎక్స్​' వేదికగా పోస్ట్​ చేశారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 19, 2024, 3:45 PM IST

Updated : Jun 19, 2024, 4:25 PM IST

Harish Rao Tweet On Law And Order
Harish Rao Tweet On Law And Order (ETV Bharat)

Harish Rao Tweet On Law And Order : రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి హరీశ్​ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. గత పదేళ్లలో శాంతిభద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్థకమవ్వటం బాధాకరమన్నారు. గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్‌ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారన్నారు.

హైదరాబాద్‌ నడిబొడ్డున బాలాపూర్​లో అందరూ చూస్తుండగానే సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుందని మండిపడ్డారు. నిన్నటి రోజున భూపాలపల్లి జిల్లాలో రక్షించాల్సిన పోలీసే తోటి మహిళా కానిస్టేబుల్‌ను భక్షించే దుర్ఘటన జరగడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు.

భూపాలపల్లి జిల్లా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుని శాంతిభద్రతలను కాపాడాలని కోరుతున్నట్లు 'ఎక్స్‌' వేదికగా హరీశ్​రావు కోరారు.

Harish Rao Comments On Junior colleges : మరోవైపు రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యమని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.

422 జూనియర్ కాలేజీల్లో 1.60 లక్షల మంది పేద, బలహీన వర్గాలకు చెందిన వారు చదువుతున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని జూనియర్ కాలేజీల్లో ఉన్న 1,654 గెస్ట్ ఫ్యాకల్టీని రెన్యువల్ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ విద్యార్థులకు వెంటనే టెక్ట్స్​బుక్స్ పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కళాశాలల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇంటర్​ కాలేజీలు ప్రారంభమైన పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు - ఇదేనా ప్రజాపాలన? : హరీశ్​రావు - Harish Rao Tweet on Junior Colleges

కాంగ్రెస్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క బస్సు తప్పా, అన్నీ పథకాలు తుస్సే : హరీశ్​రావు - Harish Rao MLC By election Campaign

Last Updated : Jun 19, 2024, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.