KTR Reaction on Sub -Classification of SC, ST Caste : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసిందని, అందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు తెలిపారు. దానికి మద్దతుగా ప్రధానికి లేఖ కూడా ఇచ్చామని పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణపై మిగతా రాజకీయపార్టీలన్నీ ఓట్ల రాజకీయం చేశాయని కేటీఆర్ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కేసీఆర్ సామాజిక కోణంలో చూశారని చెప్పారు. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వటం శుభపరిణామమన్నారు. సుప్రీంతీర్పు ఆధారంగా వర్గీకరణ ప్రక్రియను కాంగ్రెస్ ప్రారంభించాలని కేటీఆర్ కోరారు. ఎస్సీ వర్గీకరణకు బీఆర్‌ఎస్ తరఫున ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రకటించారు.
Harish Rao On SC ST Sub Caste Classification : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 29 నవంబర్ 2014లో తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తీర్మానం గురించి కేసీఆరే స్వయంగా ప్రధానికి వివరించారని దానికి ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ చేయాలని 16మే, 2016 నాడు ప్రధాని మోదీని స్వయంగా కలిసి లేఖ ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, తద్వారా విద్య, ఉద్యోగ అవకాశాల్లో యువతకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను. అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ కోసం గతంలో ప్రాణాలు అర్పించారన్న ఆయన గాంధీభవన్ వద్ద ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ వర్గీకరణ చేయట్లేదని మందకృష్ణ నేతృత్వంలో గాంధీభవన్‌ను ముట్టడించేందుకు వచ్చారని చెప్పారు. అమరులైన మాదిగ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని హరీశ్ ఆరోపించారు.
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నాం. గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
— Harish Rao Thanneeru (@BRSHarish) August 1, 2024
ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ఉద్యమం నుంచే బిఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు… pic.twitter.com/Mhx1VLNYUk
Manda Krishna Madiga On Sub Classification Of ST, SC : ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో న్యాయం, ధర్మం కోసం 20 ఏళ్లుగా పోరాటం చేసి విజయం సాధించామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విద్యా, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తీర్పుపై మళ్లీ కోర్టుకు వెళ్లవద్దని ఎస్సీ ఉపకులాలను ఆయన కోరారు. వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని ప్రభుత్వాలను కోరారు.