ETV Bharat / politics

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు- పార్టీ పుట్టుకే సంచలనమన్న కేటీఆర్ - BRS Formation Day celebrations - BRS FORMATION DAY CELEBRATIONS

BRS Formation Day Celebrations : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సాధనకై ఏర్పడ్డ పార్టీ ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధిని చేసిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అలుపెరుగని సామర్థ్యంతో సాధించుకున్న రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని వ్యాఖ్యానించారు. జిల్లాల్లో మాజీ మంత్రులు సహా నేతలు వేడుకను అట్టహాసంగా నిర్వహించారు.

BRS Formation Day Celebrations
BRS Formation Day Celebrations
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 7:33 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు- పార్టీ పుట్టుకే సంచలనమన్న కేటీఆర్

BRS Formation Day Celebrations : రాష్ట్రవ్యాప్తంగా గులాబీపార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ పుట్టుకే ఓ సంచలనమని వ్యాఖ్యానించారు. పార్టీ ఏర్పాటు నుంచి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కుల మతాలకతీతంగా పోరాడామని గుర్తు చేసుకున్నారు. పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

BRS Formation Day Celebrations In Hanamkonda : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని పురస్కరించుకుని అన్ని జిల్లాల్లోను నేతలు ఘనంగా నిర్వహించారు. హనుమకొండలో జరిగిన వేడుకల్లో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పాల్గొని తెలంగాణ తల్లికి పూలమాల వేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచాారి, బండ ప్రకాష్​లతో కలిసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న గంగుల: కరీంనగర్ జిల్లా తీగల గుట్టపల్లిలోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. భూమి, నీరు, గాలి ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందని గంగుల అన్నారు. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాని ఎగరేసిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి రాష్ట్ర సర్కార్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్‌ నుంచి రాష్ట్ర విముక్తికోసం బీఆర్ఎస్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతోందని వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

హామీల అమలుపై రేవంత్‌ రెడ్డి అమరవీరుల స్థూపం వద్దకు రావాలి : హరీశ్‌రావు - Harish Rao Fires On Cm Revanth

BRS Formation Day Celebrations Peddapalli : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఘనంగా నిర్వహించారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎమ్మెల్యే మాణిక్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పట్టణంలోని దత్తగిరి కాలనీలో పార్లమెంటు ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

కేసీఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు : బీఆర్ఎస్ నేత కోరుకంటి చందర్ - Korukanti Chandar Fires On Congress

జాతీయ పార్టీలు రెండూ బీఆర్​ఎస్​ను దెబ్బతీయాలని చూస్తున్నాయ్‌ : కేసీఆర్ - KCR Election Campaign 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.