BRS Focus on Chevella Lok Sabha Candidate : చేవెళ్ల లోక్‌సభ స్థానానికి ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం బీఆర్ఎస్ అన్వేషణ కొనసాగిస్తోంది. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) పోటీకి విముఖతతో ఉన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆయన తన అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం. శనివారం కూడా రంజిత్ రెడ్డితో పార్టీ ముఖ్య నేతలు ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది. రంజిత్ రెడ్డి మాత్రం తాను లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపాలన్న విషయమై కసరత్తు చేస్తోంది.
Lok Sabha Polls 2024 : మాజీ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, మహేశ్ రెడ్డి, ఆనంద్స తదితరులతో పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) సమావేశమయ్యారు. రోహిత్ రెడ్డి పోటీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగినట్లు తెలిసింది. రోహిత్ రెడ్డి కూడా తాను పోటీ చేయలేనని చెప్పినట్లు సమాచారం. కాసాని జ్ఞానేశ్వర్, కాసాని వీరేశం, కార్తీక్ రెడ్డి, స్వామి గౌడ్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
హాట్ కేక్‌లా మెదక్ ఎంపీ స్థానం - సీటు కోసం ప్రధాన పార్టీల ఆశావహుల విశ్వ ప్రయత్నాలు
చేజారిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు : ఇప్పటికే నాగర్ కర్నూల్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ రాములు కమల తీర్థం(BJP) పుచ్చుకుని, తన కుమారుడు భరత్ ప్రసాద్‌కు టికెట్ ఇప్పించుకున్నారు. ఇప్పుడు ఆ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్లో ఎవరు పోటీ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. అయితే నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు గట్టి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు గత పదేళ్లుగా బీఆర్ఎస్ ఎంపీ స్థానానికి కంచుకోటగా ఉన్న జహీరాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ దిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ జహీరాబాద్ టికెట్‌ను ఆయనకే ఇచ్చింది. ఇది అక్కడ స్థానిక నేతలు, కార్యకర్తలకు నచ్చలేదు. అయినా బీజేపీ అధిష్ఠానం బీబా పాటిల్‌కే టికెట్ కేటాయించింది. అయితే ఈ స్థానంలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలని బీఆర్ఎస్ ఆలోచనలో పడింది. అయితే కేటీఆర్ మాత్రం ఎవరు పార్టీనుంచి వెళ్లిపోయిన పార్టీకి ఎలాంటి నష్టం లేదని ప్రకటించారు. తెలంగాణలో 17 పార్లమెంటరీ నియోజకవర్గాల అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి గట్టి పోటీ - త్రిముఖ పోరులో గెలిచేదెవరో?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ - ఆ నేతలంతా 'కారు' దిగి 'కమలం'లోకి!