ETV Bharat / politics

తొందరపడొద్దు, భవిష్యత్తు బీఆర్ఎస్​దే - పార్టీ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ సూచన - KCR Meet BRS MLAs at Erravalli - KCR MEET BRS MLAS AT ERRAVALLI

KCR Meet BRS MLAs at Erravalli : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో వరుసగా గులాబీ ఎమ్మెల్యేలతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తున్నారు. రానున్న రోజులు తమకే భవిష్యత్తు ఉంటుందని సమావేశమైన వారికి గులాబీ బాస్ సూచించినట్లుగా సమాచారం.

Ex CM KCR Meeting with BRS MLA's
KCR Meet BRS MLAs at Erravalli (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 6:47 PM IST

Updated : Jun 26, 2024, 7:19 PM IST

Ex CM KCR Meeting with BRS MLA's : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండడంతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. పార్టీ వీడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నష్టమేమి లేదని ఎవరు తొందరపడద్దని తెలిపారు.

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం కొందరు శాసనసభ్యులతో సమావేశమైన కేసీఆర్‌, నేడు పలువురు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ రజినీలతో పాటు పలువురు కార్పొరేటర్లు ఉన్నారు. రానున్న రోజులు తమకే భవిష్యత్తు ఉంటుందని సమావేశమైన వారికి కేసీఆర్ సూచించినట్లుగా సమాచారం.

KCR Fires on Party Defections : హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఫిర్యాదు చేసి మూణ్నెల్లు దాటినా, ఇప్పటి వరకు స్పీకర్‌ చర్యలు తీసుకోలేదని, ఇదే విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మహారాష్ట్ర కేసులో ఏ న్యాయవాదులైతే వాదించారో, వారినే గులాబీ పార్టీ తరఫున సుప్రీంకోర్టులో వాదనలకు ఎంచుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై సహచర పార్టీ శ్రేణులతో చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడడంపై పార్టీ సీరియస్‌గా దృష్టిపెట్టిందన్నారు. ఈ అంశంపై గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రాతిపదికగా తీసుకొని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిద్దామని తెలిపారు.

పార్టీ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ సూచన : మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న గులాబీ దళపతి, ఇలాంటి పరిణామాలు గతంలో వైఎస్‌ హయాంలోనూ జరిగాయన్నారు. అయినా మనం భయపడేదిలేదన్నారు. ఇప్పుడు కూడా తిరిగి ప్రజల మద్దతు మనకే లభిస్తుందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న కేసీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులెవరూ అధైర్యపడొద్దు. పార్టీ, తానూ ఎప్పుడూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రజల సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడదామని గులాబీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఈక్రమంలోనే గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకుందామని వివరించారు.

కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్​ఎస్​కు నష్టం లేదు - భవిష్యత్​లో పార్టీకి మంచి రోజులు : కేసీఆర్​ - BRS MLAs met former CM KCR

పోచారం, సంజయ్​ అనర్హత పిటిషన్​పై శాసనసభ స్పీకర్​ స్పందించరా?​​ : జగదీశ్​ రెడ్డి - Jagadish Reddy on Speaker prasad

Last Updated : Jun 26, 2024, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.