BRS Chief KCR Lok Sabha Election Campaign : లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తుండటంతో గులాబీదళం ప్రచార వేగం పెంచనుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నేతలు, పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని (BRS Election Campaign) కొనసాగిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ఆయా నియోజకవర్గాల్లో నాయకులు, శ్రేణులతో సమావేశమవుతూ వస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొంటుండగా, నేటి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు.
BRS Public Meeting in Chevella : కరీంనగర్ కదనభేరితో ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇవాళ చేవెళ్ల వేదికగా జరగనున్న బహిరంగ సభ (BRS Public Meeting) ద్వారా ప్రచారాన్ని ఉద్ధృతం చేయనున్నారు. చేవెళ్లలో పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో గులాబీ దళపతి పాల్గొని ప్రసంగిస్తారు. చేవెళ్ల ఫరా ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ సభకు భారీగా జన సమీకరణ చేసి విజయవంతం చేసేలా బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను కూడా నియమించారు.
ఎండిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేసీఆర్ - బీఆర్ఎస్ అండగా ఉంటుందంటూ భరోసా
ఈ నెల 16న మెదక్ నియోజకవర్గంలోనూ కేసీఆర్ సభ(KCR Sabha at Medak) జరగనుంది. సంగారెడ్డి నియోజకవర్గం సుల్తాన్‌పుర్ సమీపంలోని సింగూరు చౌరస్తా వద్ద నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో గులాబీ దళపతి లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ దఫా ఎక్కువగా బస్సు యాత్రలు, రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్ రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
BRS Election Campaign Start at Chevella : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది. ఇదే సమయంలో పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని వివరించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పదేళ్ల తమ పాలనలో తీసుకున్న చర్యలను వివరిస్తూ, ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలను బీఆర్ఎస్ (BRS) సిద్ధం చేస్తోంది.
కేసీఆర్ ప్లాన్ ఛేంజ్ - బహిరంగ సభలకు బైబై - బస్సు యాత్రలు, రోడ్ షోలతోనే ఎన్నికల ప్రచారం
పార్లమెంటు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమించిన బీఆర్ఎస్