ETV Bharat / politics

ఎండిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేసీఆర్ - బీఆర్​ఎస్​ అండగా ఉంటుందంటూ భరోసా​ - BRS Chief KCR Nalgonda Tour

BRS Chief KCR Crop Inspection in Jangaon District : రాష్ట్రంలో ఎండిన పంట పొలాలను బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. సాగునీరు లేక కర్షకులు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా చూశారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఎండిన చేలను పరిశీలించారు. అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించిందన్నారు.

KCR Nalgonda Tour
BRS Chief KCR Nalgonda Tour
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 12:35 PM IST

Updated : Mar 31, 2024, 7:37 PM IST

ఎండిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేసీఆర్ - బీఆర్​ఎస్​ అండగా ఉంటుందంటూ భరోసా​

BRS Chief KCR Crop Inspection in Jangaon District : ఎండిన పంట పొలాల క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా తొలుత జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు కేసీఆర్ చేరుకున్నారు. ఎండిన పంట(Crop Damage) చేలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పరిహారం ఇప్పించేలా చూడాలంటూ అన్నదాతలు ప్లకార్డులు ప్రదర్శించారు. చేతికందే దశలో పంటలు ఎండిపోయాయని తమను ఆదుకోవాలని కోరారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. ఓ మహిళా రైతు కుమార్తె పెళ్లికి రూ.5 లక్షల సాయాన్ని ప్రకటించారు. కేసీఆర్ వెంట బీఆర్​ఎస్​ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వరరెడ్డి, మాలోత్ కవిత, తదితర నేతలు ఉన్నారు.

Crop Damage in Suryapet District : అనంతరం సూర్యాపేట జిల్లా చేరుకున్న కేసీఆర్, తుంగతుర్తి నియోజకవర్గం వెలుగుపల్లిలో ఎండిన పంట పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. రైతులకు బీఆర్​ఎస్​ పార్టీ (BRS Party) అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. తుంగతుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించిన కేసీఆర్‌కు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్‌ కాన్వాయ్​ను తనిఖీ చేసిన పోలీసులు - EC Officials Inspected to KCR Bus

ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోయాయి : ప్రభుత్వ అసమర్థత వల్ల ఎండిపోయిన పంట పొలాల్లో ప్రతి ఎకరాకు రూ.25 వేల పరిహారం సర్కారు చెల్లించాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. పట్టుకొమ్మల్లాంటి పల్లెసీమల్లో ఇవాళ బోర్ల హోరు వినిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను పవర్‌ ఐలాండ్‌ సిటీగా తాము మార్చామన్న కేసీఆర్‌, రాత్రింబవళ్లు కొట్లాడి నేషనల్‌ పవర్‌ గ్రిడ్‌కు అనుసంధానం చేయించామన్నారు. ఏడేళ్ల పాటు అద్భుతంగా నడిచిన వ్యవస్థ, ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా ఆగిపోయిందన్న కేసీఆర్‌, కాంగ్రెస్‌ పాలకుల తెలివి తక్కువ తనం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు.

"రైతుల పంటలు ఎండగొడతారా? మీకు అసలు రైతులంటే పట్టింపే లేదు. రైతుబంధు ఇవ్వటానికి కింద మీద పడ్డారు. వస్తదా రాదా అన్న భయంకర పరిస్థితి తెచ్చారు. సాగు నీరు, తాగు నీరు అందివ్వటంలో ఘోరంగా విఫలమయ్యారు. ఏం కారణం? ఇప్పటికైనా మేల్కోండి."- కేసీఆర్​, బీఆర్​ఎస్​ అధినేత

వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు : కేసీఆర్‌ - KCR FIRES ON CONGRESS GOVT

'రేవంత్ రెడ్డికి వసూళ్ల మీద ఉన్న సోయి రైతుల మీద లేదు - ప్రభుత్వంలో చలనం తెచ్చేందుకే కేసీఆర్​ పంటల పరిశీలన' - Jagadish Reddy on Drying crops

Last Updated : Mar 31, 2024, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.