ETV Bharat / politics

బీజేపీ పదేళ్ల పాలనలో ఏ వర్గం వారైనా లాభం పొందారా? : కేసీఆర్ - KCR BUS Yatra AT Bhuvanagiri - KCR BUS YATRA AT BHUVANAGIRI

KCR BUS Yatra In Bhuvanagiri : కాంగ్రెస్, బీజేపీలు రెండూ భువనగిరిలో మిలాఖత్ అయ్యాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో అనేక సమస్యలు ఉంటే బీజేపీ అవేమీ పట్టించుకోకుండా అక్షింతలు, ప్రసాదాలు, శోభాయాత్రలపైనే దృష్టిపెట్టిందని విమర్శించారు. భువనగిరిలో రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

KCR BUS Yatra In Bhuvanagiri
KCR BUS Yatra In Bhuvanagiri
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 8:49 PM IST

Updated : Apr 25, 2024, 11:00 PM IST

Kcr Road Show At Bhuvanagiri : దేశంలో అనేక సమస్యలు ఉంటే బీజేపీ అవేమీ పట్టించుకోకుండా అక్షింతలు, ప్రసాదాలు, శోభాయాత్రలపైనే దృష్టిపెట్టిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ పదేళ్ల పాలనలో ఏ వర్గం వారైనా లభం పొందారా? అని ఆయన ప్రశ్నించారు. భువనగిరిలో రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'భేటీ పడావో భేటీ బచావో' నినాదాలకే పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. దేశ చరిత్రలో ఏనాడు లేని విధంగా డాలర్ ధర పెరిగిపోయిందన్నారు.

KCR Fires On BJP Congress : భువనగిరిలో బీజేపీ, కాంగ్రెస్​లు రెండు మిలాఖత్ అయ్యాయన్నారు. రెండో రోజు బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్ సూర్యాపేట నుంచి భువనగిరికి వచ్చారు. ఈ సందర్భంగా మార్గ మధ్యలో తనను చూసేందుకు వచ్చిన ప్రజలతో కేసీఆర్ ముచ్చటించారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న కేసీఆర్ 24 గంటల కరెంట్ నాశనం చేసిందని విమర్శించారు. మాయమైన బోరుబండ్లను మళ్లీ తెరపైకి తెచ్చారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రైతు బంధు లేదు కరెంటూ లేదని ఆయన దుయ్యబట్టారు.

'నా గుండె చీలిస్తే కనిపించేది తెలంగాణ ప్రజలు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీ కోసమే(ప్రజల) ఉంటాను. మంచి మెజార్టీతో క్యామా మల్లేశ్​ను గెలిపించాలని కోరుతున్నాను. భగవంతుడు తెలంగాణ కోసమే నన్ను పుట్టించాడనిపిస్తోంది. ఒక పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతోంది, మరో పార్టీ ఎక్కడికి వెళితే అక్కడ ఒట్టు వేస్తోందని కేసీఆర్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి. ఓటర్లు ఆలోచించి పరిణితితో ఓట్లు వేయాలని కోరుతున్నా' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

రైతులు ఆత్మహత్యలపై పట్టించుకునే నాథుడే లేడు : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనే దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేసీఆర్ విమర్శించారు. మిల్లర్లు దగ్గర కమీషన్లు తీసుకొని రైతులను గాలికి వదిలేశారని తెలిపారు. తొమ్మిదేళ్లలో ఎప్పుడూ లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తాను పక్కకి పోగానే అన్నీ బంద్ అయ్యాయన్న గులాబీ దళపతి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 225 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకునే నాథుడే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్కూటీలు ఏమో కాని లూటీలు చేస్తున్నారు : యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందన్న కేసీఆర్ ఈరోజు దాని ఊసేలేదన్నారు. ఇవాళ ఒక్క ప్రైవేటు కళాశాలకి కూడా ఫీజు రీయింబర్స్​మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు స్కూటీలు ఏమో కానీ లూటీలు చేస్తున్నారని విమర్శించారు.

KCR Fires On Congress Government : కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రైతు బోనస్ రూ.500 అన్నారు ఎవరికైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. భువనగిరిలో రోడ్ షో అనంతరం ప్రజలకు అభివాదం చేసుకుంటూ బీఆర్ఎస్ అధినేత ఎర్రవెల్లి ఫామ్ హౌస్​కు బయలుదేరారు.

"కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చింది. కేసీఆర్ పదివేలు ఇస్తామన్నారు కదా మేము(కాంగ్రెస్) రూ.15వేలు ఇస్తామని చెప్పింది. కేసీఆర్ లక్షమాఫీ చేశారు కదా మేం రూ.2లక్షలు మాఫీ చేస్తాం అని హామీలిచ్చింది. రైతుబంధు అందరికీ వచ్చిందా? ఉంటాదో ఊడగొడతారో అది కూడా తెలుస్తలేదు. 5 ఎకరాలకే ఇస్తాం, మూడు ఎకరాలకే ఇస్తామని కాంగ్రెస్ చెబుతుంది. రైతులకేమన్నా బెంజ్ కార్లున్నాయా? తొమ్మిదేళ్లు కరెంటు ఇచ్చిండు కదా కేసీఆర్? నేను పక్కకు జరగంగానే కరెంటు మాయమౌతదా."- కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత

బీజేపీ పదేళ్ల పాలనలో ఏ వర్గం వారైనా లాభం పొందారా? : కేసీఆర్

మిర్యాలగూడలో మొదలై సిద్దిపేటలో ముగింపు - కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే - KCR Bus Yatra Schedule 2024

కేసీఆర్​ బస్సు యాత్ర షురూ - 17 రోజుల్లో 12 నియోజకవర్గాలను చుట్టేయనున్న బీఆర్​ఎస్​ అధినేత - KCR BUS YATRA IN TELANGANA

Last Updated : Apr 25, 2024, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.