ETV Bharat / politics

నేడే బీఆర్ఎస్ చలో మేడిగడ్డ - ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు నేతలు రె'ఢీ'

BRS Chalo Medigadda Tour Today : కామధేనులాంటి కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపే ప్రభుత్వ యత్నాన్ని, దుష్ప్రచారాన్ని తిప్పికొడతామన్న బీఆర్ఎస్, ఇవాళ మేడిగడ్డ, అన్నారం ఆనకట్టలను సందర్శించనుంది. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు నీటిపారుదల నిపుణులు సైతం పర్యటనకు వెళ్లనున్నారు. అన్నారం వద్ద ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పనున్నట్లు గులాబీ నేతలు పేర్కొన్నారు.

BRS to Visit Kaleshwaram Project
BRS Leaders to visit Medigadda Today
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 7:05 AM IST

నేడే బీఆర్ఎస్ చలో మేడిగడ్డ - ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు నేతలు రెడీ

BRS Chalo Medigadda Tour Today : భారత్ రాష్ట్ర సమితి బృందం ఇవాళ మేడిగడ్డ, అన్నారం ఆనకట్టలను సందర్శించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గులాబీ పార్టీ ఈ పర్యటన చేపడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్టలోని పియర్స్ కొన్ని కుంగాయి. అన్నారం ఆనకట్టలోనూ సీపేజీ సమస్య ఉత్పన్నమైంది. దీంతో రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదిలి రెండు ఆనకట్టలని ఖాళీ చేశారు.

BRS Leaders to visit Medigadda Today : ఆనకట్టలో నీరు నిల్వ చేస్తే ప్రమాదమని ఎన్​డీఎస్​ఏతో పాటు నిపుణులు చెప్పారని, మేడిగడ్డ, అన్నారంలో నీరు నిల్వ చేసే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ప్రస్తుతం అక్కడ పరీక్షలు కొనసాగుతుండగా, ఎన్​డీఎస్​ఏ సిఫార్సుల(NDSA Recommendations) ప్రకారమే తాము తదుపరి కార్యాచరణ చేపడతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు.

రాష్ట్రప్రభుత్వ వాదనతో భారత్ రాష్ట్ర సమితి విభేదిస్తోంది. మేడిగడ్డ ఆనకట్టలో కొన్ని పియర్స్ మాత్రమే కుంగాయని, ప్రభుత్వం మాత్రం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును విఫలమైనదిగా చూపే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మత్తులు చేయాల్సింది పోయి ఆనకట్ట మొత్తం కొట్టుకుపోవాలన్న కుట్ర పూరిత వైఖరితో వ్యవహరిస్తోందని అంటోంది.

KTR Calls Chalo Medigadda : త్వరలోనే తామూ మేడిగడ్డ సందర్శిస్తామని, కాంగ్రెస్ పార్టీ బండారం బయట పెడతామని గులాబీ అధినేత కేసీఆర్ నల్గొండ సభలో ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఇవాళ మేడిగడ్డతో పాటు అన్నారం ఆనకట్టల(Annaram Dams) వద్దకు వెళ్తోంది. అధినేత మినహా పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పర్యటనలో పాల్గొననున్నారు. కొందరు విశ్రాంత ఇంజనీర్లు, నిపుణులు సైతం వారితో పాటు పర్యటించే అవకాశం ఉంది.

మేడిగడ్డపై కాంగ్రెస్​ది రాజకీయం - రైతులకు నీళ్లివ్వకుండా కాలయాపన చేయడం దారుణం : కేటీఆర్

BRS to Visit Kaleshwaram Project : ఇప్పటికీ కాఫర్ డ్యాం నిర్మించి నీటిని పంపుల ద్వారా ఎత్తిపోయవచ్చని, అయితే ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. రాజకీయంగా తమపై ఉన్న కోపంతో రైతులు, ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వాన్ని కోరుతోంది. రెండు ఆనకట్టల వద్ద పర్యటన తర్వాత అన్నారం వద్ద ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. గతంలో నీటిపారుదల శాఖా మంత్రులుగా పనిచేసిన సీనియర్ నేతలు కడియం శ్రీహరి, హరీశ్‌రావు అక్కడే మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

దశల వారీగా ప్రాజెక్టులోని మిగతా కాంపోనెంట్లను సందర్శిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్​ను బద్నాం చేయాలని, రాజకీయంగా వేధించాలనుకుంటే వేధించవచ్చని, తాము మాత్రం రైతులకు నీరివ్వాలని కోరుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వంలో ప్రతిదీ ముఖ్యమంత్రి(CM Revanth Reddy), మంత్రులకు తెలియాలని లేదన్న ఆయన, ఎక్కడైనా తప్పులు జరిగి ఉండే జరగొచ్చని వ్యాఖ్యానించారు.

చేత కాకపోతే తప్పుకొని మాకు ఇస్తే చేసి చూపుతాం : నరేంద్రమోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్​డీఎస్ఏ ఇచ్చిన రాజకీయ ప్రేరేపిత నివేదికను పట్టుకొని మంత్రి ఉత్తమ్ ఊదరగొడుతున్నారని మండిపడ్డ కేటీఆర్, మరి సీబీఐ, ఈడీలను ఎందుకు తప్పు పడుతున్నారని ప్రశ్నించారు. డ్యాంలు, రిజర్వాయర్లు, బ్యారేజ్​ల మధ్య తేడా తెలుసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రికి సూచించారు.

ప్రతి పనిలోనూ సమస్యలుంటాయని వాటిని గుర్తించి ప్రభుత్వం పరిష్కరించాలి తప్ప, పోటీగా మేము పాలమూరు పోతామని చెప్పడం దృష్టి మరల్చడమే అని పేర్కొన్నారు. చేత కాకపోతే తప్పుకొని మాకు ఇస్తే చేసి చూపుతామన్న హరీశ్​రావు(Harish Rao) వ్యాఖ్యలను గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ పరిశీలించారు. బ్యారేజీల సందర్శన అనంతరం ప్రజలకు వాస్తవాలు చెప్పనున్నట్లు పేర్కొన్నారు.

కాళేశ్వరంపై సీఎం కుట్ర చేస్తున్నారు - మార్చి 1 నుంచి బీఆర్ఎస్ చలో మేడిగడ్డ : కేటీఆర్

రేవంత్​కు కేటీఆర్ ఛాలెంజ్ - మల్కాజిగిరి ఎంపీ బరిలో తేల్చుకుందామంటూ సవాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.