Lok sabha elections 2024 : సీఎం రేవంత్‌రెడ్డి ఐదు నెలల్లోనే అవివీతి మార్కు చూపిస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఐదు గ్యారంటీలు అమలు చేశామని, గాడిద గుడ్డు పట్టుకుని తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు హోర్డింగ్స్ పెట్టుకున్నారని, ఏ ఒక్క మహిళా సంఘానికి అయిన రుణాలు ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు.
స్టీల్‌ప్లాంట్‌పై రేవంత్‌రెడ్డి మాట ఇచ్చిన విధంగానే, గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. రైల్వేలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికే సైనిక్ స్కూల్ మంజూరైందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ, సీఎంను ప్రశ్నిస్తున్నానని, ఏం మార్పు మెుదలైందో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన పోయి, సోనియాగాంధీ కుటుంబ పాలన వచ్చిందని దుయ్యబట్టారు.
ఒక్క రేషన్ కార్డు అయిన ఐదు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? అని కిషన్‌రెడ్డి నిలదీశారు. 58వేల కోట్లతో మూసీ అభివృద్ది ఎక్కడ జరిగిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు కర్త కర్మ క్రియ తెలంగాణ బీజేపేనని, కానీ రీజినల్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందన్నారు. కౌలు రైతులకు 12వేలు, రైతు భరోసా 15వేలు, 5 వందలకు గ్యాస్ సిలిండర్ ఎంత మందికి ఇచ్చారని నిలదీశారు.
ఉచిత విద్యుత్ ఎక్కడా అమలు జరగడం లేదని, కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రగతి భవన్ కంచెలు కూల్చారు తప్పితే, ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం చూపలేదని, ఏ ఒక్క రోజు ముఖ్యమంత్రి ప్రజావాణిలో పాల్గొనలేదని ఆయన తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు.
"లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ విడదల చేసిన మేనిఫెస్టోలో పస లేదు. రాహుల్ గాంధీ ఎట్లాగూ ప్రధాని కారని తెలిసే ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలపై రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తెలంగాణలో మెజార్టీ సీట్లను బీజేపీ గెలవబోతుంది. బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసింది". - కిషన్‌రెడ్డి, బీజేపీ నేత
బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు : కిషన్ రెడ్డి - Kishan Reddy Fires On Congress