ETV Bharat / politics

'కాంగ్రెస్‌ పాలన కూడా కేసీఆర్ పాలన మాదిరే ఉంది - సన్న వడ్లకే బోనస్‌ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటో?' - BJP Graduates MLC Election Campaign - BJP GRADUATES MLC ELECTION CAMPAIGN

Kishan Reddy Fires on Congress Party : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన కూడా కేసీఆర్ పాలన మాదిరే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని హస్తం పార్టీ మోసం చేసిందన్న ఆయన, సన్న వడ్లకే రూ.500 బోనస్‌ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

Kishan Reddy
Kishan Reddy Fires on Congress Party (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 23, 2024, 4:38 PM IST

Kishan Reddy Graduates MLC Election Campaign : తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పీడపోవాలని హస్తం పార్టీకి ఓటేస్తే, ఇప్పుడు రేవంత్​ రెడ్డి సర్కార్​ పరిపాలనా అలాగే సాగుతుందని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన, బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు రెండూ నిజాం వారసులే అని, రెండు పార్టీల డీఎన్ఏలు ఒక్కటే అని కిషన్​రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పాలన కూడా కేసీఆర్ పాలన మాదిరే ఉందని, కాంగ్రెస్‌ పాలనలోనూ ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయని ఆరోపించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ మోసం చేసిందన్న కిషన్​రెడ్డి, సన్న వడ్లకే రూ.500 బోనస్‌ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటో చెప్పాలని డిమాండ్​ చేశారు. ఈ క్రమంలోనే రెండూ కుటుంబ పార్టీలే అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు షాక్ ట్రీట్​మెంట్​ ఇవ్వాలని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సన్నవడ్లకే బోనస్ అంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు : కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్​ రెడ్డి ఫైర్ - Kishan Reddy on Paddy Bonus Issue

కాంగ్రెస్‌ పాలన కూడా కేసీఆర్ పాలన మాదిరే ఉంది. కాంగ్రెస్‌ పాలనలోనూ ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయి. బీఆర్​ఎస్​, కాంగ్రెస్ రెండూ నిజాం వారసులే. రాష్ట్ర ప్రజల నెత్తిపై కాంగ్రెస్‌ భస్మాసుర అస్త్రం పెట్టింది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ మోసం చేసింది. సన్న వడ్లకే రూ.500 బోనస్‌ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటో? - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

12 స్థానాలు ఖాయం : తెలంగాణలో బీజేపీకి 12 ఎంపీ స్థానాలు రావడం ఖాయమని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెద్దవూరలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు శానంపూడి సైదిరెడ్డి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వెంకటేశ్​ నేతలతో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పాలనలో దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్ పార్టీలతో ఒరిగేదేమీ లేదని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

మేం ఆశించినట్లుగానే రాష్ట్రంలో బీజేపీకి రెండంకెల ఎంపీ సీట్లు వస్తాయి : కిషన్ ​రెడ్డి - Kishan Reddy on BJP MP seats

కాంగ్రెస్​ పార్టీ 70 ఏళ్లుగా అబద్ధాలతో రాజకీయాలు చేస్తోంది : కిషన్‌ రెడ్డి - TBJP Chief Kishan Reddy Press Meet

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.