BJP MP Candidates Lok Sabha Elections Campaign : బీజేపీ అభ్యర్థులు విస్తృతంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్ లో పదవి విరమణ పొందిన సైనికుల ఆత్మీయ సమ్మేళనంలో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మరోసారి బీజేపీ సర్కార్ అధికారంలోకి రావాలని ఈటల స్పష్టం చేశారు. త్రివిధ దళాలను శక్తివంతంగా చేసి, ప్రపంచంలో భారత దేశాన్ని గొప్ప ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.
మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు నామినేషన్ వేసిన సందర్భంగా అక్కడ నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీల గురించి నిలదీయాలని పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి సూట్ కేసులను నమ్ముకుని ఎన్నికల్లో పోటీకి వస్తున్నారన్నారని ఆరోపించారు.
"తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే ముందు మీరు ఆరు గ్యారంటీలు అమలు చేశారా అని అడుగుతున్నా. మీరు వాటిని అమలు చేయలేదు. అందుకే ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు లేదు. ప్రజలు తిరగబడండి. అడగండి. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరితమైన హామీలతోనే అధికారంలోకి వచ్చింది. అందుకు వాటి అమలు అడగాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలదే అని నేను కోరుతున్నాను." - కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి
నిజామాబాద్‌లోని కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానిది ఆర్భాటాలు తప్పితే చేతల్లో చూపించడంలేదని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. నాగర్ కర్నూల్‌లోని లోక్‌సభ నియోజకవర్గ, బూత్ స్థాయి సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సారి మోదీ ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలు జరగవంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు : ఎంపీ లక్ష్మణ్ - MP laxman on India Alliance
"మోదీ ప్రభుత్వ అభివృద్ధిపైనా, ఏజెండాపైనా, గత పది సంవత్సరాల్లో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలపైన రాహుల్ గాంధీకి మాట్లాడటం ఏ మాత్రం ఆస్కారం లేకుండా పోయింది. అందుకే వారు పదే పదే చేసే విమర్శలు చూస్తుంటే, ఒక్కోసారి అర్ధం కాని పరిస్థితి." - లక్ష్మణ్, బీజేపీ ఎంపీ
మోదీ గ్యారంటీలే అస్త్రం - లోక్‌సభ పోరులో జోరుగా బీజేపీ ప్రచారం - LOK SABHA ELECTION 2024