BJP MP Candidates Election Campaign in Telangana : రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నా, ఎండలు మండిపోతున్నా రాజకీయ నాయకులు మాత్రం ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగిపోతున్నారు. పోలింగ్‌కు మరో మూడు రోజులు మాత్రమే ఉన్నందున ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. బీజేపీ అగ్రనాయకులు రాష్ట్ర పర్యటన చేసి అభ్యర్థుల్లో జోష్ నింపుతున్నారు. ఎంపీ అభ్యర్థులు ఓటర్ల దగ్గరకు నేరుగా వెళ్లి మూడోసారి మోదీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Kishan Reddy Campaign in Secunderabad : కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియా కూటమి ఎన్ని కుట్రలు చేసినా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి మోదీ ప్రధాని అవడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైందని పేర్కొన్నారు. ఆ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
సికింద్రాబాద్ ఎంపీగా మా ఆయననే గెలిపించండి - కిషన్ రెడ్డి సతీమణి ప్రచారం - Kishan Reddy Wife Campaign
"ఇంటింటికి బీజేపీ పేరిట తెలంగాణలో ప్రచారం ప్రారంభించాం. నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీకు మద్దతు తెలిపే విధంగా ప్రయత్నం చేస్తాం. గ్రామాల్లో మంచి స్పందన లభిస్తోంది. ఏ గ్రామానికి వెళ్లిన మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. మోదీపైన దేశ ప్రజలకు విశ్వాసం ఏర్పడింది. మాకు 400 సీట్లుపైగా వస్తాయి." - కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Kishan Reddy On BRS and Congress : బీఆర్ఎస్కు ఓటు వేస్తే వృధా అవుతుందని డిపాజిట్లు కూడా రావని కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి బీజేపీ పేరిట హిమాయత్ నగర్, హైదర్ గూడలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని ప్రజలను అభ్యర్దించారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన కూటమికి ఆధారం లేదని, ఆ పార్టీ గెలిచేది లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.