ETV Bharat / politics

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మత కలహాలు, అవినీతి కుంభకోణాలు : కిషన్‌ రెడ్డి - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

BJP MP Candidate Kishan Reddy Election Campaign : దేశంలో సుస్థిరమైన పాలన ఉండాలంటే, బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముషీరాబాద్​ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఆయన జీప్​ యాత్ర నిర్వహించారు.

BJP Candidates Election Campaign
BJP MP Candidate Kishan Reddy Election Campaign
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 4:57 PM IST

BJP MP Candidate Kishan Reddy Election Campaign : దేశానికి స్థిరమైన పాలన అందించడానికి నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్​ ఎంపీ అభ్యర్థి కిషన్ ​రెడ్డి (Secunderabad BJP Candidate Kishan Reddy) అన్నారు. ముషీరాబాద్​ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఆయన జీప్ యాత్ర చేపట్టారు. ఇవి దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను సూచించారు. తమ విలువైన ఓటు హక్కును కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలకు వేసి వృథా చేసుకోవద్దని హితవు పలికారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దించి - దొంగలు పోయి గజ దొంగలు వచ్చారు : కిషన్‌ రెడ్డి - BJP Kishan Reddy Fires on Congress

"దేశంలో, రాష్ట్రంలో ఎవ్వరూ తమ ఓటు హక్కును వినియోగించకుండా ఉండకూడదు. అబ్దుల్ కలాం చెప్పినట్టు ప్రతి ఒక్కరూ పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనాలి. ప్రధాని నరేంద్ర మోదీని ఆశీర్వదించాలి. ఆయనను ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రిని చేయాలి. ప్రస్తుతం కాంగ్రెస్​, బీఆర్​ఎస్​కు ఓటు వేసినా, అది వృథా అవుతుంది. ఎవ్వరూ తమ ఓటును దుర్వినియోగం చేసుకోకూడదు. దేశంలోని 140 కోట్ల ప్రజలతో గెలిచేది నరేంద్ర మోదీనే." - కిషన్​ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కర్ఫ్యూ మతకలహాలు అవినీతి కుంభకోణాలు కిషన్‌రెడ్డి

BJP Candidates Election Campaign : దేశంలో తీవ్రవాదాన్ని పూర్తిగా అణచి వేయడంలో నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కృషి ఎనలేనిదని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలో భారత దేశం అత్యున్నత స్థాయికి ఎదిగిందని తెలిపారు. దిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కృష్టి చేస్తుందని ఆయన వివరించారు. కరోనా సమయంలో భారత దేశం అతలాకుతలమవుతుందని ప్రగల్బాలు పలికిన ప్రపంచ దేశాల మాటలకు, వ్యాక్సిన్​ ద్వారా దీటైన సమాధానం చెప్పారని ఆయన గుర్తు చేశారు.

అసత్య ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ధర్మపురి అర్వింద్ - Dharmapuri Arvind meet BJP IT Cell

Kishan Reddy Fires On Congress : దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, కుటుంబ పాలన, కర్ఫ్యూ, కరెంటు కోత, నీటి కొరత రావడం సత్యం అన్నారు. సుస్థిరమైన పాలనను అందిస్తున్న మోదీనే యావత్​ దేశ ప్రజలందరూ మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ప్రకటించిన హమీల (Congress Six Guarantees ) అమలు ఎటు పోయిందని ఆయన ప్రశ్నించారు. ప్రజలను గ్యారంటీల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇచ్చిన గ్యారంటీలనే అమలు చేయలేదని, దేశవ్యాప్తంగా అమలు కోసం హామీలు తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. వంద రోజులు పూర్తయినా, ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని విమర్శించారు. ఈ యాత్రలో కార్పొరేటర్లు పావని వినయ్ కుమార్, రచన శ్రీ పాల్గొన్నారు.

రూ.2500కే దిక్కు లేదు - రూ.లక్ష ఇస్తామంటూ మరోసారి మోసానికి తెర లేపారు : లక్ష్మణ్ - BJP MP Laxman Fires on Congress

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.