ETV Bharat / politics

లిక్కర్ స్కాంపై సీబీసీఐడీతో విచారణ చేయించి దోషులను కఠినంగా‌ శిక్షించాలి: బీజేపీ ఎమ్మెల్యేలు - BJP MLAs on Liquor Scam - BJP MLAS ON LIQUOR SCAM

BJP MLAs coments on Liquor Scam in YSRCP Government: రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణం అంతా జగన్ కనుసన్నల్లోనే నడిసిందని బీజేపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మద్యం పేరిట 30 వేల కోట్ల రూపాయలు జగన్ దోపిడీ చేశారని ఆరోపించారు. ఈ లిక్కర్ స్కాంపై సీబీసీఐడీతో విచారణ చేయిస్తామని అన్నారు. ఇందులో ఉన్న దోషులను కఠినంగా‌ శిక్షించాలని డిమాండ్ చేశారు.

bjp_mlas_on_liquor_scam
bjp_mlas_on_liquor_scam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 10:26 PM IST

BJP MLAs coments on Liquor Scam in YSRCP Government: రాజధానికి 15 వేల కోట్లు కేంద్ర బడ్జెట్​లో కేటాయించడం శుభపరిణామమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తెలిపారు. గత జగన్ ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేసేసిందనే బాధలో నిన్న అసెంబ్లీలో ఓటర్లపై ఒక మాటను మాట్లాడానని ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరికైనా ఓటు వేసే హక్కు ఉంటుందని ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటానాని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వంలో మద్యంలో జరిగిన అవకతవకలపై సీఎం చంద్రబాబు డిటైల్డ్​గా వివరించారని విష్ణు కుమార్ అన్నారు. లిక్కర్ తయారు చేస్తున్నది జగన్ బినామీలేనని ఆరోపించారు. లిక్కర్ స్కామంతా జగన్ కనుసన్నల్లోనే నడిసిందని ధ్వజమెత్తారు. లిక్కర్​లో 30 వేల కోట్ల రూపాయలు జగన్ దోపిడీ చేశారని ఆరోపించారు. ఇదే విషయం అసెంబ్లీలో చెప్పామని వెల్లడించారు. లిక్కర్ స్కాంపై సీబీసీఐడీతో విచారణ చేయిస్తామని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేవలం 200 కోట్ల రూపాయలు మరి రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల స్కాంకు విచారణ తర్వాత అన్ని విషయాలు బయటకొస్తాయని వెల్లడించారు.

జగన్‌ పాలనలో ఎంతో మందిని చంపారు కదా వారిలో ఒక్క పేరైనా చెప్పొచ్చుగా: లోకేశ్ - Nara Lokesh on YS Jagan

MLA Adi Narayana Reddy: లిక్కర్​లో క్యాష్ ట్రాన్సెక్షన్ చేయడం వలన వేల కోట్ల అక్రమాలు జరిగాయని మరో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దుయ్యబట్టారు. సీబీసీఐడీ ద్వారానే లిక్కర్ స్కాంలో వాస్తవాలు బయటకొస్తాయని తెలిపారు. ఈడీ సహకారం కూడా తీసుకుంటామనడంతో మరిన్ని వివరాలు బయటకొస్తాయని తెలిపారు. జగన్ అసెంబ్లీలో ఉండాలి కాని దిల్లీ వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. లిక్కర్ స్కాం బయటకొస్తుందనే భయంతో జగన్ దిల్లీ పోయాడని ఎద్దేవా చేశారు. జగన్ ఇక అసెంబ్లీకి రాడన్న ఆదినారాయణరెడ్డి తన అక్రమాలు బయటపడతాయనే రాష్ట్రపతి పాలన రావాలి మళ్లీ సీఎం కావాలి రాష్ట్రాన్ని దోచుకోవాలి అతని నైజమని విమర్శించారు. ఇకపై రాష్ట్రంలో బెల్టు షాపులు లేకుండా చేస్తామని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.

MLA Parthasarathy: దిల్లీలో 200 కోట్ల కుంభకోణమైతే ఏపీలో 30 వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. మద్యం స్కాం గురించి రాష్ట్రం మొత్తం తెలిసేలా చేయాలని కోరారు. దేశంలోనే అతిపెద్ద స్కాంలలో ఈ మద్యం కుంభకోణమని ఒకటని తెలిపారు. సీబీసీఐడీతో పాటు డబ్బులకు సంబంధించింది కాబట్టి ఈడీ విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు బయటకొస్తాయన్నారు. 30 వేల కోట్ల మద్యం స్కాంపై దోషులను కఠినంగా‌ శిక్షించాలని ఎమ్మెల్యే పార్థసారథి డిమాండ్ చేశారు.

"పాలకుడు ఎలా ఉండకూడదో గత ఐదేళ్లలో చూశాం- మద్యం సొమ్మంతా వైఎస్సార్సీపీ నేతల జేబుల్లోకి వెళ్లింది" - excise department white paper

మాట ఇచ్చాం-రద్దు చేశాం - ల్యాండ్​ టైటిలింగ్​ చట్టం ఉద్దేశం అదే: చంద్రబాబు - Land Titling Act Repeal Bill

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.