BJP Lok Sabha Elections 2024 : రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 10 సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తోంది. పార్టీ శ్రేణులు నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉండటంతో అంతకుముందే రథయాత్రలు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే 17 లోక్‌సభ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించిన కమల దళం ఫిబ్రవరి 10 నుంచి యాత్రలు ప్రారంభించేలా సన్నాహాలు చేస్తోంది. ఒక్కో యాత్రలో 20 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. రోజుకు రెండు అసెంబ్లీ నియోజక వర్గాలను చుట్టేసేలా యాత్ర సాగనుంది.
రెండంకెల పార్లమెంట్ సీట్లే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో బీజేపీ రథయాత్రకు సన్నాహం
BJP Ratha Yatra For Lok Sabha : తొలి రోజు యాత్రలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్రలకు ఒక్కోరోజు ఒక ముఖ్య నాయకుడు నాయకత్వం వహిస్తారని వివరించాయి. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో రెండు కార్నర్ మీటింగ్స్ జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆ సమావేశాలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులను అవసరాలకు అనుగుణంగా రప్పించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. యాత్రల ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సాహాసోపేతమైన నిర్ణయాలు తెలంగాణకు కేటాయించిన నిధులు, గత బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలపై ప్రజా క్షేత్రంలో ప్రశ్నించేందుకు సమాయత్తమవుతోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేనతో పొత్తు ఉండదు : ఎంపీ లక్ష్మణ్
BJP Leaders Comments On BRS : కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీబీఐతో విచారణ జరిపించాలని ఎందుకు కోరట్లేదని నిలదీయాలని బీజేపీ యోచిస్తోంది. పది రోజుల పాటు యాత్రలతో రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజలతో మమేకం కావడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా రథయాత్రలు చేపట్టాలని అంతా సిద్ధం చేసుకున్నాక అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా రథయాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టబోతుంది. ఈ సారైనా రథయాత్రలు జరగుతాయా లేద వాయిదా పడతాయా అనేది చర్ఛనీయాంశంగా మారింది.
BJP Appointed Assembly IN charges : మరోవైపు 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జీలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నియమించారు. రాష్ట్ర పదాధికారులతో జూమ్‌లో సమావేశమైన ఆయన ఫిబ్రవరి 2న రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ ఇంఛార్జీలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల వరకు జిల్లా ఇన్‌ఛార్జీలు ఉండరన్న కిషన్‌రెడ్డి వచ్చేనెల 5 నుంచి 8వరకు పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. జిల్లా అధ్యక్షులు ఏకపక్షంగా వ్యవహరిస్తే కుదరదన్న కిషన్‌రెడ్డి పనిచేయని వారిపై వేటు తప్పదని సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. ఒకటి రెండ్రోజుల్లో అసెంబ్లీ ఇంఛార్జీలను నియమించనున్నట్టు తెలుస్తోంది.
వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక - ఏ పార్టీతోనూ కలవబోమన్న కిషన్ రెడ్డి
లోక్‌సభ ఎన్నికల్లో 10 సీట్లే లక్ష్యంగా 'బీజేపీ క్లస్టర్ సమావేశాలు'