ETV Bharat / politics

రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి - ఎలాంటి పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి : కిషన్​రెడ్డి

BJP Leaders Meeting in Hyderabad : రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయని, ఏ పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నేతలకు ఆయన మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్‌లోనూ కొత్త రక్తాన్ని చేర్పించాలని, ఫిబ్రవరి నెలంతా చేరికలపై దృష్టి కేంద్రకరించాలని చెప్పారు.

BJP Plan For Parliament Elections 2024
BJP Leaders Meeting in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 1:54 PM IST

Updated : Feb 2, 2024, 2:11 PM IST

BJP Leaders Meeting in Hyderabad : కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లతో సమావేశాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మండల, గ్రామ స్థాయి కమిటీలను బలోపేతం చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా గుర్తించిన బూత్ కమిటీల పని తీరుపై సమీక్షించుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో చేరికలను ప్రోత్సహించాలని, యువతను బీజేపీలో చేర్చుకునేందుకు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నేతలకు మార్గ నిర్దేశనం చేశారు.

పది సీట్లే టార్గెట్​ - నిత్యం జనంలో ఉండేలా రథయాత్రలు - బీజేపీ లోక్​సభ ఎన్నికల ప్లాన్ ఇదే

BJP Plan For Parliament Elections 2024 : తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ఏ పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. రాజకీయలతో సంబంధం లేకుండా అనేక రంగాలకు చెందిన ప్రముఖులను పార్టీలో చేర్చుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్​లో కొత్త రక్తాన్ని చేర్పించాలని, ఫిబ్రవరి నెల మొత్తం చేరికలపై దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. పార్లమెంట్ లేదా అసెంబ్లీల వారీగా ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించాలని సూచించారు.

రెండంకెల పార్లమెంట్ సీట్లే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో బీజేపీ రథయాత్రకు సన్నాహం

"తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఏ పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. రాజకీయాలతో సంబంధం లేకుండా అనేక రంగాలకు చెందిన వాళ్లను పార్టీలో చేర్చుకోవాలి. ప్రతి పోలింగ్ బూత్​లో కొత్త వ్యక్తులను చేర్పించాలి. ఫిబ్రవరి నెల మొత్తం చేరికలపై దృష్టి కేంద్రీకరించాలి. పార్లమెంట్ లేదా అసెంబ్లీల వారీగా ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించాలి." - కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి - ఎలాంటి పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి కిషన్​రెడ్డి

విపక్షాలు పెట్టుకున్న కూటమి అప్పుడే విచ్చిన్నం అవుతోంది : కిషన్​రెడ్డి

గ్రూప్​-1 నోటిఫికేషన్​ ఏది? : ప్రజలను మోసం చేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ యువతను మోసం చేసిందని ఓ ప్రకటనలో కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల వాగ్దానంలో ఫిబ్రవరి 1న నిరుద్యోగ యువత కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిందని గుర్తు చేశారు. చెప్పిన సమయం దాటిపోయిందని, ఇంతవరకైతే నోటిఫికేషన్ రాలేదన్నారు. హామీలు ఇచ్చి మోసం చేసే ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని విమర్శించారు. నమ్మి ఓటేసిన తెలంగాణ యువతను నిట్టనిలువునా మోసం చేసిందని ఆరోపించారు. యువతను మోసం చేసినట్లే, ఇతర వాగ్దానాలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు.

లోక్​సభ ఎన్నికల్లో 10 సీట్లే లక్ష్యంగా 'బీజేపీ క్లస్టర్ సమావేశాలు'

Last Updated : Feb 2, 2024, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.