ETV Bharat / politics

రాష్ట్రంలో పీక్​​లో ఎన్నికల ప్రచారం- నేడు తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు - JP Nadda Public Meeting in TS - JP NADDA PUBLIC MEETING IN TS

BJP Leaders Election Campaign in Telangana : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జోరు పెంచింది. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో అగ్ర నాయకత్వం రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్‌ధామి, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నేడు రాష్ట్రానికి వస్తున్నారు. పార్టీ అభ్యర్థుల తరుపున సభలు, సమావేశాల్లో పాల్గొననున్నారు.

Rajasthan CM Bhajan Lal Sharma Secunderabad Meeting
BJP Leaders Meetings (E tv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 7:08 AM IST

రాష్ట్రంలో పీక్​​లో ఎన్నికల ప్రచారం- నేడు తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు (Etv Bharat)

BJP Leaders Election Campaign in Telangana : లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి డబుల్ డిజిట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెట్టిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు పర్యటించారు. పార్టీ అభ్యర్థుల తరుపున సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఇవాళ మరోసారి పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్‌ధామి తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

JP Nadda Telangana Tour 2024 : బీజేపీ అగ్ర నాయకులు తొలుత పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కు మద్దతుగా నిర్వహించే సభకు జేపీ నడ్డా హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటుప్పల్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండ నిర్వహించే సభలో ఆయన పాల్గొననున్నారని పార్టీ నేతలు వెల్లడించారు. కేంద్రంలో పదేళ్ల పాలనతో తమ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు జేపీ నడ్డా తెలియజేయనున్నారు. దాంతో పాటు కాంగ్రెస్​ ఇస్తామన్న గ్యారంటీలపై, రుణమాఫీ అంశాలపై మాట్లాడనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

తెలంగాణలో ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది : తమిళిసై - former governor tamilisai

Rajasthan CM Bhajan Lal Sharma Campaign : రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఇవాళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లో నిర్వహించనున్న ప్రవాసి సమ్మేళనంలో రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ పాల్గొంటారు. ఉదయం ముషీరాబాద్‌లో యువ సమ్మేళనానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్‌ధామి హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో నర్సంపేటలో నిర్వహించనున్న సభలో పాల్గొననున్నారు.

BJP Leader Annamalai Meeting in Telangana : కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని జమ్మికుంటలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తిలో నిర్వహించనున్న సభలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పరిధిలో సనత్‌నగర్ నుంచి పద్మారావునగర్ వరకు అన్నామలై, కిషన్‌రెడ్డి బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల బూటకం : ధర్మపురి అరవింద్ - BJP MP Arvind Election Campaign

ప్రజలు బీజేపీని మరోసారి ఆశీర్వదించబోతున్నారు - రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు మావే : కిషన్‌ రెడ్డి - Kishan Reddy Meet the Press

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.