BJP Leader Raghunandan Rao Fires on BRS : దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీకి విమర్శలతో కూడిన ప్రశ్నలు సంధించారు. అధికారం కోల్పోయాక పార్టీ కార్యకర్తలు గుర్తుకొచ్చారా అంటూ నిలదీసిన ఆయన, సమీక్షల పేరుతో కార్యకర్తలకు, ఉద్యమకారులకు సముచిత స్థానం, సీట్లు ఇస్తామనడం సిగ్గు చేటన్నారు. శంకరమ్మ విషయంలో మీరన్న మాట గుర్తు రాలేదా అని ఆ పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
Ex MLA Raghunandan Counter To KTR : మల్లన్న సాగర్, పోచమ్మ సాగర్ పేరు చెప్పి, ప్రజల వద్ద వందల కోట్లు దోచుకున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని, మీ పార్టీని బొందపెట్టారని కేసీఆర్‌ను ఉద్దేశించి దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌ను సీఎం చేస్తానని, ఆశీర్వాదం కావాలని అడిగితే మీతో మాకు పొత్తు కుదరదని మోదీ చెప్పిన రోజే ఇద్దరి మధ్య తెగదెంపులు అయిపోయాయని తెలిపారు. భారతీయ జనతా పార్టీపై అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మజ్లిస్‌తో అంటకాగే ఏ పార్టీతో బీజేపీ కలిసి ముందుకు వెళ్లదు : రఘునందన్ రావు
"కేటీఆర్, హరీశ్‌రావుకు ఇప్పుడు ఉద్యమకారులు గుర్తొచ్చారా. అధికారం కోల్పోయాక సముచిత స్థానం ఇస్తామంటున్నారు. మల్లన్న సాగర్, పోచమ్మ సాగర్ పేరుతో రూ.వందల కోట్లు దోచుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉద్యమకారుల కుటుంబాలకు సీట్లు ఇస్తారా? అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్, హరీశ్‌రావు ప్రమాణం చేయాలి. త్యాగం చేసిన కుటుంబాలకు సీట్లు ఇస్తామని చెప్పే ధైర్యం ఉందా? బీఆర్ఎస్లో తలుపులు మూసి సమీక్షలు చేస్తున్నారు. ఇక్కడ భూములిచ్చిన ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని పిలిచి సమీక్ష చేయగలరా? భారత రాష్ట్ర సమితి మొదట శంకరమ్మ, ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు సీట్లు ఇవ్వాలి. మా పార్టీపై అవాకులు, చవాకులు పేలితే ఊరుకోం." - రఘునందన్ రావు, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకోలేదని రఘునందన్ రావు ఆరోపించారు. శంకరమ్మ పేరు ప్రచారం చేసుకుని ఉద్యమకారులకు అన్యాయం చేశారని విమర్శించారు. కష్టపడే వారికి బీఆర్ఎస్లో గుర్తింపు లేదన్న ఆయన, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అయినా ఉద్యమకారులకు సీట్లు ఇవ్వాలన్నారు. ఉద్యమకారులకే సీట్లు ఇస్తామని అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్, హరీశ్‌రావు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి పార్టీలో రూ.వందల కోట్లు సంపాదించిన వారికే సీట్లు ఇస్తారని, సీట్లు అమ్ముకుందాం, డబ్బు దండుకుందాం అనేదే ఆ పారీట ఆలోచన అని దుయ్యబట్టారు.
MLA Raghunandan Rao Latest Comments : రంగులు వెలిసిపోయినా.. పేదవానికి ఇళ్లు రావట్లేదు!
బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అని దుష్ప్రచారం చేస్తున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను నాశనం చేయాలని చూస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన, నిన్నటి అయోధ్య కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు రాలేదని గుర్తు చేశారు. భారత రాష్ట్ర సమితిని ఖతం చేసేందుకు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని చెప్పారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి, బీఆర్ఎస్ను కాల్చే అవసరం తమకు లేదన్నారు. 'మిమ్మల్ని మీరే కాల్చుకున్నారు, ఎవరో కాల్చనక్కర్లేదు. బీఆర్ఎస్ నేతల అహంకారమే వారిని ప్రజలకు దూరం చేసింది'. అని రఘునందన్ రావు స్పష్టం చేశారు.