ETV Bharat / politics

ప్రజలు బీజేపీని మరోసారి ఆశీర్వదించబోతున్నారు - రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు మావే : కిషన్‌ రెడ్డి - Kishan Reddy Meet the Press - KISHAN REDDY MEET THE PRESS

BJP Leader Kishan Reddy Meet the Press Program : రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలు బీజేపీ సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనేదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని బషీర్​బాగ్​లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Kishan Reddy Comments on Congress
Kishan Reddy Meet the Press Program (ETV BHARAT)
author img

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 12:20 PM IST

Updated : May 5, 2024, 2:50 PM IST

ప్రజలు బీజేపీని మరోసారి ఆశీర్వదించబోతున్నారు రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు మావే కిషన్‌ రెడ్డి (ETV Bharat)

Kishan Reddy Meet the Press Program : రూ.1.02 లక్షల కోట్లతో తెలంగాణలో రహదారులు నిర్మించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. అవినీతి ఆరోపణ లేకుండా తొమ్మిదిన్నరేళ్లు బీజేపీ పరిపాలించిందని అన్నారు. అవినీతి రహిత ప్రభుత్వం రావాలని ప్రజలు 2014లో మోదీకి ఓటేశారని, మరోసారి ఆశీర్వదించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని బషీర్​బాగ్​లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Kishan Reddy on 10 Years Development : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మాదిరే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ తయారవుతుందని కిషన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. రైల్వే శాఖకు నిధుల కొరత లేకుండా చేశామని అన్నారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.9 లక్షల కోట్లకు పైగా నిధులను తెలంగాణలో ఖర్చు చేశామని పేర్కొన్నారు. రూ.1.02 లక్షల కోట్లతో రహదారులు నిర్మించామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో దేశంలో రహదారులు నిర్మిస్తున్నామని అన్నారు. 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్‌ అందిస్తున్నామని గుర్తు చేశారు. 13 కోట్ల ఇళ్లల్లో టాయిలెట్లు నిర్మించామని వివరించారు.

సికింద్రాబాద్ ఎంపీగా మా ఆయననే గెలిపించండి - కిషన్ రెడ్డి సతీమణి ప్రచారం - Kishan Reddy Wife Campaign

"ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉండేవి. కాంగ్రెస్‌ హయాంలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయి. అవినీతిరహిత ప్రభుత్వం రావాలని ప్రజలు 2014లో మోదీకి ఓటేశారు. కాంగ్రెస్‌ చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతిని బీజేపీ సరిదిద్దింది. అవినీతి ఆరోపణ లేకుండా తొమ్మిదిన్నరేళ్లు మా పార్టీ పరిపాలించింది. మా ప్రభుత్వ హయాంలో మత కలహాలు, ఉగ్రవాద కార్యకలాపాలు లేవు. ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టాం. ప్రస్తుతం పాకిస్థాన్‌ తినడానికి తిండి లేక భిక్ష మెత్తుకుంటుంది." - కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Kishan Reddy Comments on Congress : బీజేపీ హయాంలో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించిందని కిషన్‌ రెడ్డి తెలిపారు. ట్రిపుల్‌ తలాక్‌ చట్టాన్ని ముస్లిం సమాజం మొత్తం ఆమోదించిందని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారత్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ పట్టించుకోవట్లేదని అన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలు బీజేపీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

యూపీఏ, ఎన్డీయే ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా - సీఎం రేవంత్​ రెడ్డికి కిషన్​రెడ్డి సవాల్ - Kishan Reddy Letter To Cm Revanth

గ్యారంటీలు అమలు చేయకుండా గాడిద గుడ్డు చూపిస్తున్నారు : కిషన్‌రెడ్డి - lok sabha elections 2024

Last Updated : May 5, 2024, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.