ETV Bharat / politics

కాంగ్రెస్‌ గూటికి జితేందర్ రెడ్డి - కేబినెట్‌ హోదా ఇచ్చిన అధిష్ఠానం - Jitendra Reddy Joined Congress

BJP leader Jitendra Reddy Joined Congress Party : బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్‌ ముఖ్యనేత జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఏఐసీసీ ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, సీఎం రేవంత్‌ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనను వెంటనే దిల్లీలో కేబినెట్‌ హోదాలో అధిష్ఠానం నియమించింది.

BJP leader Jitendra Reddy Joined Congress
BJP leader Jitendra Reddy Joined Congress Party
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 10:35 PM IST

BJP leader Jitendra Reddy Joined Congress Party : కాంగ్రెస్ గూటికి మరో నాయకుడు చేరారు. నిన్న ముఖ్యమంత్రితో సమావేశమైన జితేందర్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ గూటికి చేరారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్​లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కుమారుడితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వెంటనే క్యాబినెట్‌ ర్యాంకుతో కూడిన పదవిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగానూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు.

BJP leader Jitendra Reddy Joined Congress Party
కేబినెట్‌ హోదాలో నియామకం

CM Revanth Meet Jitendra Reddy : ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్​ కుమార్‌ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు, సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌ రెడ్డిలు పాల్గొన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ప్రభుత్వం నియమించిన మాజీ ఎంపీ మల్లు రవి ఇటీవల ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. నాగర్‌ కర్నూల్‌ నుంచి లోకసభ ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) పోటీ చేస్తున్నందున మల్లు రవి ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఇవాళ పార్టీలో చేరిన జితేందర్‌ రెడ్డికి వెంటనే ఆయనను ధిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వెంటనే క్యాబినెట్‌ ర్యాంకు కలిగిన పదవిలో జితేందర్‌ రెడ్డిని నియమించడం విశేషం.

Jitendra Reddy Resigned from BJP : అంతకు ముందు జితేందర్‌ రెడ్డి బీజేపీ(BJP Resign)కి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను పంపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ఉన్నప్పుడు పార్టీ బలోపేతం అవుతూ వచ్చిందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోకి పార్టీని తీసుకుపోవడంలో విశేష కృషి చేశారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 25 సీట్లు వస్తాయని అంచనా వేసుకోగా అధ్యక్షుడిని మార్చడం వల్ల కేవలం 8 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. లోక్​సభ ఎన్నికల్లో కూడా ఇటీవల పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత ఇచ్చారని, దానిని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో వివరించారు.

సీఎం రేవంత్​రెడ్డితో బీఆర్ఎస్​ ఎమ్మెల్యే, ఎంపీ భేటీ - కాంగ్రెస్​ గూటికి చేరువయ్యేనా?

బీఆర్​ఎస్​కు మరో షాక్ - కాంగ్రెస్​లోకి గుత్తా అమిత్​ రెడ్డి !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.