ETV Bharat / politics

పీఏలు, బినామీలు అప్రూవర్లుగా మారి ఇచ్చిన సమాచారంతోనే కవిత అరెస్టు - బీజేపీకి సంబంధం లేదు : కిషన్‌రెడ్డి - kishan reddy on kavitha arrest

Kishan Reddy on Kavitha Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కవిత పీఏలు, బినామీలు అప్రూవర్లుగా మారి వివరాలు ఇస్తున్నారన్నారు. లిక్కర్‌ బిజినెస్‌ పేర్లతో వ్యాపారాలు చేసి, బీజేపీపై విమర్శలు చేయడమేంటని మండిపడ్డారు.

Kishan reddy fires on Congress
Kishan Reddy on Kavitha Arrest
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 17, 2024, 5:47 PM IST

Kishan Reddy on Kavitha Arrest : దేశంలో అవినీతి చేస్తే ఎంతటివారినైనా, ఏ కుటుంబాన్నైనా వదిలే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవిత అరెస్టుకు, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో కిషన్‌రెడ్డి (Kishan Reddy) పాల్గొన్నారు. పలువురికి కాషాయ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దిల్లీకి వెళ్లి కవితను (Kavitha Arrest) బీర్ పార్టీలను ఎవరు చేయమన్నారని ప్రశ్నించారు. కోర్టు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పుకు కట్టుబడి ఉంటామని లెంపలేసుకొని చెప్పాలని సూచించారు. లిక్కర్ బిజినెస్‌లో బినామీ పేర్లతో వ్యాపారాలు చేసింది వారని, విమర్శలు బీజేపీపై ఎందుకని ఆయన మండిపడ్డారు. కవిత పీఏలు, బినామీలు అప్రూవర్లుగా మారి వివరాలు ఇస్తున్నారన్నారు. ఈడీ ఇండిపెండెంట్ సంస్థ అని, దానికి అన్ని అధికారాలు ఉంటాయన్నారు.

"బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. దేశంలో అవినీతి చేస్తే ఎంతటివారినైనా, ఏ కుటుంబాన్నైనా వదిలే ప్రసక్తే లేదు. కవిత పీఏలు, బినామీలు అప్రూవర్లుగా మారి వివరాలు ఇస్తున్నారు. ఈడీ ఇండిపెండెంట్ సంస్థ. దానికి అన్ని అధికారాలు ఉంటాయి". - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి

కవిత అరెస్ట్‌కు, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు: కిషన్‌రెడ్డి

Kishan reddy fires on Congress : దేశంలో నరేంద్ర మోదీకి మెదటిసారి ఎన్నికల కంటే, రెండోసారి ప్రజల నుంచి మద్దతు పెరిగిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో జరిగే లోక్​సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు ఆమలు చేస్తామని ప్రగల్బాలు పలికారని, తీరా అధికారంలోకి వచ్చాక దాని ఊసే లేదని దుయ్యబట్టారు.

కుటుంబ రాజకీయాలు, అవినీతిపైన బీజేపీ ప్రభుత్వం పోరాటం చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ 10 ఏళ్ల కాలంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ హామీలు ఫ్లెక్సీ వరకే అమలవుతున్నాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానం కూడా అసదుద్దీన్‌ను ఓడించి బీజేపీ గెలవాలని, రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

భారతదేశం సంస్కృతి, ఆధ్యాత్మిక శక్తికి కేంద్రం : కేెంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ములుగు గిరిజన యూనివర్సిటీని ప్రారంభించిన కిషన్‌ రెడ్డి

ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ - పలువురు నేతల రియాక్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.