BJP Contesting Seats List: రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలు దాదాపుగా ఖరారయ్యాయి. విశాఖ ఉత్తర, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, బద్వేలు, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని, కైకలూరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ పోటీ చేయనుంది. చివరి నిమిషంలో ఒకటి, రెండు సీట్లలో మార్పులు జరిగేందుకు అవకాశం ఉంది.
కాగా పొత్తులో భాగంగా బీజేపీకి పది శాసనసభ స్థానాలు, 6 పార్లమెంటు సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అభ్యర్థుల జాబితాలపై బీజేపీలో సస్పెన్స్ కొనసాగుతూనే వచ్చింది. బీజేపీ ఆశిస్తున్న నియోజకవర్గాల జాబితాను తొలి నుంచీ అత్యంత గోప్యంగా ఉంచారు. తాజాగా అసెంబ్లీ స్థానాలపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్థానాలనుంచి బీజేపీ తరఫున పోటీలో నిల్చునే అభ్యర్థుల జాబితా కూడా సిద్ధమైంది.
బీజేపీ రెండో జాబితా విడుదల - తెలంగాణ నుంచి ఆరుగురి పేర్లు ఖరారు
విశాఖ ఉత్తరం, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్వేలు, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్థానాల నుంచి తమ పార్టీ పోటీ చేయనున్నారు. ఈ నెల 11వ తేదీన ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో సుదీర్ఘ చర్చల అనంతరం కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి భేటీ అయ్యారు.
15 మంది అభ్యర్థుల జాబితాను పురందేశ్వరి షెకావత్‌కు అందజేసినట్లు తెలిసింది. దిల్లీ వెళ్లాక షెకావత్, ఉండవల్లిలో చర్చల సారాంశాన్ని పార్టీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్‌షాలకు వివరించారు. ఈ మేరకు అభ్యర్థుల పేర్లు, పోటీ చేసే స్థానాలు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను బీజేపీ ప్రకటించనుంది.
చిలకలూరిపేటలో మోదీ సభకు భారీ ఏర్పాట్లు- ముఖ్య నేతలతో 13 కమిటీలు
పరిశీలనలో ఉన్నవారి పేర్లు: విశాఖ నార్త్ నుంచి సీనియర్ నేత విష్ణుకుమార్‌రాజు, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, కైకలూరు నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమువీర్రాజు, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నుంచి సురేష్, ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ), ఆదోని నుంచి కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనిగిరి నీలకంఠం, శ్రీకాకుళం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.సురేంద్రమోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
అయితే అంతకుముందు పార్టీ సీనియర్ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపన ఫౌండేషన్) ఏదో ఒక శాసనసభ స్థానం నుంచి పోటీచేసే అవకాశముందనే వార్తలు వచ్చాయి. అదే విధంగా కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ అల్లుడు సాయిలోకేష్ కూడా బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం వీరి పేర్లు వినిపించడం లేదు. దీంతో చివరి నిమిషంలో ఒకటి, రెండు స్థానాల్లో మార్పులు జరిగేందుకు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది.
లోక్‌సభ స్థానాల అభ్యర్థులు వీరేనా: బీజేపీకి కేటాయించిన ఆరు పార్లమెంటు నియోజకవర్గాల్లో రాజమహేంద్రవరం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి మునిసుబ్రహ్మణ్యం, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు, అరకు నుంచి కొత్తపల్లి గీత దాదాపు ఖరారయ్యారని అంటున్నారు.
కొలిక్కివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు - సుదీర్ఘ చర్చల అనంతరం ప్రకటన